
మరిడమ్మ ఆలయానికి భక్తుల రద్దీ
పెద్దాపురం: కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా పేరొందిన పెద్దాపురం మరిడమ్మ ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా ఈఓ విజయలక్ష్మి మాట్లాడుతూ గత నెల ఆషాఢ మాస జాతర ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామన్నారు. మళ్లీ దాతల సహకారంతో ఈ వారం నుంచి అన్నదానం ప్రారంభించామన్నారు.
వకుళమాత అన్నదాన
భవనానికి విరాళాలు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో వకుళమాత అన్నప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. ఆదివారం ఏలూరుకు చెందిన ఇరగవరపు వీఎంఆర్‌టీ రాజు, వెంకటసుష్మ దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.1,10,116, గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన డేగల రాంబాబు, కోమల దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.50,116 అందజేశారు. దాతలకు దేవస్థానం సిబ్బంది స్వామివారి చిత్రపటాలను అందజేశారు.

మరిడమ్మ ఆలయానికి భక్తుల రద్దీ