
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ట్రాక్టర్
తొట్టెలో కూర్చున్న కూలీ మృతి
గోకవరం: తిరుమలాయపాలెం–రంపయర్రంపాలెం గ్రామాల మధ్య విద్యుత్ స్తంభాన్ని ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై పవన్‌కుమార్ వివరాల మేరకు, తిరుమలాయపాలెంలో ఇటుకల లోడు దింపిన ట్రాక్టర్ ఐదుగురు కూలీలతో రంపయర్రంపాలెం వైపు బయలుదేరింది. డ్రైవర్ అజాగ్రత్తగా నడిపి, రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో స్తంభం విరిగి ట్రాక్టర్ తొట్టైపె పడటంతో, తొట్టెలో ఉన్న కూలీ కోరుకొండ మండలం కాపవరానికి చెందిన కొట్టాల శివ(36) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెనుముప్పు తప్పింది. మిగిలిన నలుగురు కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పవన్‌కుమార్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో కళాకారుడి మృతి
అన్నవరం: జాతీయ రహదారిపై స్థానిక మండపం జంక్షన్ వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దాపురానికి చెందిన సంగీత కళాకారుడు ఎన్.ఆదినారాయణ(60) మృతి చెందారు. తేటగుంట తిమ్మాపురంలో బంధువుల ఇంటికి వచ్చిన ఆయన తిరుగు ప్రయాణంలో మోటార్ బైక్‌పై పెద్దాపురం వెళుతున్నారు. మండపం సెంటర్ వద్ద వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై తమకు సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు.