
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
జిల్లా వ్యవసాయాధికారి బోసుబాబు
కపిలేశ్వరపురం (మండపేట): ఎరువుల కృత్రిమ కొరతను సృష్టిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి బోసుబాబు హెచ్చరించారు. మండపేటలో గురువారం ఆలమూరు సహాయ వ్యవసాయ సంచాలకుడు కేవీఎస్ చౌదరి, మండల వ్యవసాయాధికారి కె.ప్రభాకర్‌తో కలిసి ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. మండపేటలోని లక్ష్మీఅపూర్వ ఏజెన్సీస్ గౌడౌన్‌లోని నిల్వలు, రికార్డులను తనిఖీ చేసి, సంతృప్తి వ్యక్తం చేశారు. షాపుల ద్వారా ప్రతి బస్తాను ఈ–పాస్ ద్వారా విక్రయించాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన రైతుకు కచ్చితంగా బిల్లు అందజేయాలన్నారు. ఎరువు విక్రయించిన సమయానికి, బిల్లు అందజేసిన సమయానికి పొంతన లేని పక్షంలో చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట మండల విస్తరణాధికారి బాలకృష్ణ, ఇతర సిబ్బంది ఉన్నారు.