
సత్యదేవుని దర్శించిన మాజీ మంత్రి రోజా, ఎమ్మెల్సీ వరుదు
అన్నవరం: వైఎస్సార్ సీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్‌కే రోజా, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కుటుంబ సమేతంగా గురువారం రత్నగిరిలో సత్యదేవుని దర్శనం చేసుకున్నారు. తొలుత రోజా దంపతులు, కల్యాణి దంపతులు సత్యదేవుని వ్రతాలాచరించారు. అనంతరం స్వామివారిని అంతరాలయంలో దర్శించి, పూజలు చేశారు. వారికి వేద పండితులు వేదాశీస్సులు అందజేయగా, సత్యదేవుని ప్రసాదాలను ప్రొటోకాల్ గుమస్తా గణపతి అందజేశారు. వారి వెంట పార్టీ నాయకుడు, అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు వాసిరెడ్డి జగన్నాథం(జమీలు) ఉన్నారు. కాగా, స్వామివారి ఆలయానికి దర్శనం కోసం వచ్చినందున మీడియాతో మాట్లాడేందుకు రోజా, కల్యాణి ఇష్టపడలేదు.