శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025

Aug 16 2025 7:03 AM | Updated on Aug 16 2025 7:03 AM

శనివా

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025

ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శన గౌరవ వందనం సమర్పిస్తున్న దళం దేశభక్తి భావాన్ని చాటిన విద్యార్థుల ప్రదర్శన

ప్రగతి పథంలో తూర్పు

సాక్షి, రాజమహేంద్రవరం: ‘ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలందరి సమష్టి కృషితో తూర్పుగోదావరి జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడిపిద్దాం. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అందించి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడదాం. ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ స్వర్ణాంధ్ర ప్రదేశ్‌ దిశగా ముందడుగు వేద్దాం’ అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ పిలుపునిచ్చారు. స్థానిక ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వివిధ దళాల కవాతు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోలీసు వాహనంపై మంత్రి, కలెక్టర్‌, ఎస్పీ కవాతు చేపట్టారు. అంతకు ముందు మంత్రి దుర్గేష్‌ స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను ఆర్ట్స్‌ కళాశాలలో ప్రత్యక్షంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి ప్రసంగించారు. ఎందరో నాయకులు, స్వాతంత్ర సమరయోధులు, అమరవీరుల పోరాటాలు, త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. ఆ మహనీయుల త్యాగాలను స్మరిస్తూ.. ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు. బ్రిటిష్‌ పాలనలో దేశం ఆర్థిక దోపిడీకి గురైందన్నారు. ఆ పరిస్థితి నుంచి ప్రస్తుతం 5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ దిశగా, 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యంతో ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థ సాధన దిశగా అడుగులేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని 2047 నాటికి స్వర్ణాంధ్ర ప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు వెల్లడించారు.

సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం

సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతున్నామని మంత్రి దుర్గేష్‌ అన్నారు. పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతలు తొలగించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌, ప్రజల భాగస్వామ్యంతో పీ–4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. మార్గదర్శులతో బంగారు కుటుంబాలను అనుసంధానిస్తూ పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. శ్రీసూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేస్తున్నాం. పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా రూ.15 వేల ఆర్థిక తోడ్పాటు, ప్రతి ఏటా రైతుకు అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్‌ పథకం ద్వారా రూ.20 వేల పెట్టుబడి సాయం, అర్హులైన మహిళలందరికీ ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు వంటి వాటిని అమలు చేశాం. మహిళలకు సీ్త్ర శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలు చేస్తున్నాం’ అని వివరించారు.

ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలివీ..

● రాబోయే కాలంలో యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, ఉద్యోగం లేని నిరుద్యోగులకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి, మహాశక్తి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం వంటి వాటిని రానున్న రోజుల్లో అమలు చేస్తాం. ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్‌ భరోసా పింఛను పథకం కింద 17 కేటగిరీల లబ్ధిదారులకు ఇంటివద్దనే పింఛన్లు అందిస్తున్నాం.

● పేదల ఆకలి తీర్చే ఐదు అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చాం. త్వరలో మరిన్ని ప్రారంభించనున్నాం.

● ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసం ద్వారా ప్రజాసమస్యలకు జవాబుదారీతనంతో కూడిన సత్వర పరిష్కారాన్ని అందిస్తున్నాం.

● ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించాం.

● హర్‌ ఘర్‌ తిరంగా వంటి వినూత్న కార్యక్రమాలతో జాతీయ స్ఫూర్తిని పెంపొందించేలా వాడవాడలా పలు కార్యక్రమాలు చేపట్టి, స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించాం.

● చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన జిల్లా ప్రధాన కేంద్రం రాజమహేంద్రవరాన్ని పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం.

● అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలో తొలి విడతలో 1.14 లక్షల రైతులకు రూ.57.50 కోట్లు, పీఎం కిసాన్‌ పథకం కింద 20వ విడతలో 1.03 లక్షల మందికి రూ.20.76 కోట్ల సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశాం.

● జిల్లాలో 40,261 మంది రైతులు 16,406 హెక్టార్లలో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. 2025 ఖరీఫ్‌ సీజన్‌లో రూ.307 కోట్ల పంట ఋణాలు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 3,193 మంది రైతులకు రూ.13 కోట్ల ఋణాలు అందించాం.

● పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు ప్రతి మంగళ, బుధవారాల్లో రోజుకు రెండు గ్రామాల్లోని రైతులతో సమావేశమై, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నారు.

● జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 3.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. జిల్లాలో వివిధ ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతుల కోసం రూ.12.41 కోట్ల పనులు చేపట్టనున్నాం.

● ఎన్టీఆర్‌ భరోసా పింఛను పథకం కింద 17 కేటగిరీల్లో 2,,36,331 మందికి రూ.103.26 కోట్లు ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటి వద్ద పంపిణీ చేస్తున్నాం.

● జిల్లాలో ఇప్పటివరకు 36.24 లక్షల టన్నుల ఇసుకను ప్రజలకు ఉచితంగా సరఫరా చేసి, రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. వర్షాకాలంలో ఇసుక కొరత అధిగమించేందుకు జిల్లాలో 29 స్టాక్‌ పాయింట్ల ద్వారా సుమారు 10 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వ చేశాం.

● మహిళలు, బాలికల భద్రత, రక్షణ కోసం పోలీసు వ్యవస్థను అప్రమత్తం చేసి, నిఘా వ్యవస్థను మరింత పెంచాం. న్యాయ వ్యవస్థ ద్వారా జిల్లాలో సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి, వివిధ శాఖల అధికారులకు, సిబ్బందికి, పేదరిక నిర్మూలనకు సహకరిస్తున్న బ్యాంకు అధికారులకు అభినందనలు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి, ఎస్పీ డి.నరసింహకిషోర్‌, జేసీ చినరాముడు, ఆర్డీఓ కృష్ణనాయక్‌, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు

భారత స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలు శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. మంత్రి దుర్గేష్‌, కలెక్టర్‌ ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిషోర్‌, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తిని రేకెత్తించాయి. చిన్నారుల నుంచి ఉన్నత పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దేశభక్తి, ఐక్యత, త్యాగం, సాంస్కృతిక సంపదల విలువలను ప్రతిబింబించే ప్రదర్శనలు చేశారు. అంగన్‌వాడీ పిల్లల ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది.

విజేతలు వీరే..

శ్రీగౌతమి ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ ప్రథమ, ఆనందనగర్‌ మున్సిపల్‌ స్కూల్‌ ద్వితీయ, ట్రిప్స్‌ స్కూల్‌ తృతీయ స్థానాలు పొందాయి. ప్రత్యేక కన్సొలేషన్‌ బహుమతులు సాంఘిక సంక్షేమ పాఠశాల, అంగన్‌వాడీ బాలలకు, యోగా సాధన చేసిన కార్తీక్‌రెడ్డికి అందించారు.

వివిధ దళాల కవాతు

స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా నిర్వహించిన వివిధ దళాల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కవాతుకు పరేడ్‌ కమాండర్‌గా డీఎస్పీ టీవీఆర్‌కే కుమార్‌ నాయకత్వం వహించారు. 1996లో రిజర్వ్‌ ఎస్సైగా చేరి, 2010లో రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌గా, 2024లో డీఎస్పీగా పదోన్నతి పొందారు. గతంలో గ్రేహౌండ్స్‌లో పనిచేసిన ఈయన 46 సేవా గుర్తింపులు, 17 నగదు బహుమతులు, 2 ప్రతిభా పత్రాలు, 21 ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ కవాతులో సన్మాన్‌ గార్డ్‌, సివిల్‌ పురుషులు, ట్రాఫిక్‌, సివిల్‌ మహిళలు, హోం గార్డులు, ఎన్‌సీసీ బాలికలు, యువ రెడ్‌క్రాస్‌, ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ బాలుర దళాలు పాల్గొన్నాయి.

స్వాతంత్య్ర సమరయోధుల బంధువును సత్కరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు

సమష్టి కృషితో జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి

సమపాళ్లలో సంక్షేమం, అభివృద్ధి

2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యం

మహనీయుల త్యాగాలు మరువలేనివి

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌

ఘనంగా 79వ స్వాతంత్య్ర వేడుకలు

ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలు

స్వాతంత్య్ర యోధుల కుటుంబాలకు సన్మానం

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంత్రి దుర్గేష్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను ఆర్ట్స్‌ కళాశాలలో కలుసుకుని, శుభాకాంక్షలు తెలిపారు. స్వాత్రంత్య్ర యోధుల వారసులను గౌరవించడం అందరి కర్తవ్యమన్నారు. ప్రభుత్వ, సమాజ పరంగా వీరికి ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. శ్రీరంగపట్నానికి చెందిన ఆకెట్ల గంగరాముడు కుమార్తె చావలి రామలక్ష్మి, దోసకాయలపల్లికి చెందిన నెక్కంటి చంద్రవతి కుటుంబ సభ్యులు నెక్కంటి ఆదినారాయణ, వెంకటేశ్వరరావు, బలరాం, రాజమహేంద్రవరానికి చెందిన క్రొవ్విడి లింగరాజు మనవడు భాస్కరరావు, కారుమూరి మార్కండేయులు కుమారుడు నాగవిశ్వనాథం ఉన్నారు. వీరందరినీ మంత్రి సన్మానించారు.

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 20251
1/6

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 20252
2/6

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 20253
3/6

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 20254
4/6

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 20255
5/6

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 20256
6/6

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement