
డీసెట్ సర్టిఫికెట్ల పరిశీలన
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్)లో శుక్రవారం డీసెట్–2025 రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలన జరిగిందని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ఆర్‌జేడీ రాజు తెలిపారు. 20 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు పరిశీలించిన అనంతరం ఫైనల్ అడ్మిషన్ లెటర్లు అందజేశామన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన శని, ఆదివారాలు కూడా కొనసాగుతాయని చెప్పారు.
‘ఉచిత బస్సు’ ప్రారంభం
నిడదవోలు/రాజమహేంద్రవరం సిటీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీ్త్ర శక్తి పథకం అమల్లో భాగంగా నిడదవోలు డిపో, రాజమహేంద్రవరం కాంప్లెక్స్‌లో శుక్రవారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్‌తో పాటు, ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ప్రారంభించారు. తొలి జీరో ఫేర్ టికెట్‌ను మంత్రి మహిళలకు అందించారు. ఉచిత బస్సు ప్రయాణం చేసే బాలికలు, మహిళలు, యువతులు, ట్రాన్స్ జెండర్లు ఆధార్, ఓటర్ కార్డు ఏదైనా గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో 186 ఉచిత బస్సులు ఏర్పాటు చేశామన్నారు. సూపర్ లగ్జరీ, నాన్ స్టాప్ బస్సులు మినహా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ కేటగిరీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ఏపీ ఎన్‌క్లేవ్ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం చేయవచ్చన్నారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ పి.ప్రశాంతి, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థల చైర్మన్లు పాల్గొన్నారు.
రత్నగిరికి బస్సు సమర్పణ
అన్నవరం దేవస్థానానికి బస్సు
బహూకరించిన అరబిందో ఫార్మా
అన్నవరం: రత్నగిరి శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి అరబిందో ఫార్మాస్యూటికల్స్ రూ.32 లక్షలు విలువ చేసే బస్సును శుక్రవారం అందచేసింది. డీజిల్‌తో నడిచే ఈ బస్సులో 44 మంది భక్తులు ప్రయాణించవచ్చునని అధికారులు తెలిపారు. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు ఈ బస్సుకు లాంఛనంగా పూజలు చేసి ప్రారంభించారు.
వన దుర్గమ్మకు చండీహోమం
అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మకు శుక్రవారం చండీ హోమం ఘనంగా ఘనంగా నిర్వహించారు. అలాగే ప్రధానాలయంలోని సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి, కొండదిగువన తొలి పావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారికి పండితులు కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన చండీహోమం ప్రారంభించారు. అనంతరం 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహించారు. తరువాత అమ్మవార్లకు వేద పండితులు వేదాశీస్సులు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి ప్రసాదాలు నివేదించారు. అమ్మవారికి నిర్వహించిన హోమంలో 42 మంది భక్తులు పాల్గొన్నారు. సత్యదేవుని ప్రధాన ఆలయంలో దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో, కనకదుర్గ అమ్మవారికి పరిచారకుడు ప్రసాద్ ఆధ్వర్యంలో పండితులు కుంకుమ పూజలు నిర్వహించి నీరాజనమంత్రపుష్పాలు సమర్పించారు. అనంతరం ప్రసాదాలు నివేదించి భక్తులకు పంపిణీ చేశారు.

డీసెట్ సర్టిఫికెట్ల పరిశీలన

డీసెట్ సర్టిఫికెట్ల పరిశీలన