
వేలివెన్ను శశిలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
ఉండ్రాజవరం(నిడదవోలు రూరల్): ఎందరో మహనీయుల పోరాటం, త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ అన్నారు. వేలివెన్ను శశి విద్యాసంస్థల ప్రాంగణంలో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం పోటీ పరీక్షల్లో జాతీయ, రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో విద్యాసంస్థల వైస్ చైర్మన్ బూరుగుపల్లి లక్ష్మీసుప్రియ, డైరెక్టర్ శశి ప్రియ, మన్నెం వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ షేక్ షానూర్ తదితరులు పాల్గొన్నారు.