
ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన
స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. మొత్తం 12 శకటాలు పాల్గొనగా, విద్యుత్ సంస్థ శకటం ప్రథమ స్థానం సాధించగా, వ్యవసాయం–హార్టికల్చర్ ద్వితీయ, సాంఘిక సంక్షేమ శాఖ తృతీయ, పశు సంవర్థక శాఖ నాలుగు, పర్యాటక శాఖ శకటం ఐదో స్థానం సాధించాయి. విద్యా శాఖ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ శాఖ, ప్రణాళిక పీ–4 శకటాలు, వైద్యారోగ్య శాఖ, అగ్నిమాపక సంస్థ శకటాలు వినూత్న అలంకరణతో ఆకట్టుకున్నాయి.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో నిర్వహించిన ప్రదర్శనలో బహుమతులు పొందిన విద్యుత్ సంస్థ, వ్యవసాయ–ఉద్యాన శాఖ, సాంఘిక సంక్షేమ శాఖల శకటాలు

ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన

ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన