
ఆ 25 గ్రామాల పరిస్థితేమిటి?
ఆదాయం రావడం లేదనే కారణంతో జిల్లావ్యాప్తంగా 25 గ్రామాలకు కనీసం పల్లెవెలుగు బస్సులను కూడా ఆర్టీసీ నడవడం లేదు. రాజమహేంద్రవరం డిపో పరిధిలో 12, గోకవరం పరిధిలో 4, కొవ్వూరు 8, నిడదవోలు డిపో పరిధిలో 5 గ్రామాలకు ఆర్టీసీ బస్సు వెళ్లడం లేదు. ఆయా గ్రామాల ప్రజల తమ ప్రయాణాలకు ఆటోలపై ఆధారపడుతున్నారు. ప్రస్తుతం ఉచిత ప్రయాణానికి సంబంధించి ఆయా గ్రామాల ప్రజల పరిస్థితేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఉన్న పల్లె వెలుగు సర్వీసులను ఉచిత స్కీమ్‌కు వినియోగిస్తే జిల్లాలోని ఏ గ్రామీణ ప్రాంతానికీ బస్సులు నడిచే పరిస్థితులుండవని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.