సత్యవాడలో కరోనా కలకలం
కె.గంగవరం: మండల పరిధిలోని సత్యవాడ గ్రామంలో కరోనా కేసు నమోదు కావడంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. గ్రామంలో ఆదివారం పామర్రు పీహెచ్‌సీ వైద్యులు పోలిశెట్టి హర్షిత, పసుపులేటి విష్ణువర్థన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను హోమ్ క్యారంటైన్‌లో ఉంచారు. పంచాయతీ సిబ్బంది గ్రామంలో పారిశుధ్య పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్యంపై ఆరా తీశారు. వారు మాట్లాడుతూ సామాజిక దూరం పాటించడంతో పాటు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని కోరారు. దగ్గడం, తుమ్మడం వంటివి చేసినప్పుడు చేతిని అడ్డుపెట్టుకోవడం, చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవడం మంచిదన్నారు. సర్పంచ్ సలాది సూర్యకళావతి, వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
అప్రమత్తమైన వైద్య సిబ్బంది


