రాజమహేంద్రవరం రూరల్: గ్రీస్ దేశంలో ఇన్‌స్టలేషన్ టెక్నీషియ న్స్, ప్లంబింగ్, నిర్మాణ రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వీడీజీ మురళి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్‌స్టలేషన్ టెక్నీషియన్ (లారిసా) కోసం ఐటీఐ ఎలక్ట్రీషియన్, ప్లంబర్‌కు రెండేళ్ల అనుభవం ఉండాలన్నారు. వీరికి వేతనం 830 యూరోలు (రూ.1,80,000) ఇస్తారని, సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 8 గంటల పని ఉంటుందని వివరించారు. ప్లంబింగ్, సీవేజ్, ఫైర్ ఫైటింగ్ రంగాల్లో ఉద్యోగాలకు ఐటీఐ ప్లంబర్ చదివి, పదేళ్ల అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వీరికి వేతనం 900 యూరోలు (రూ.1,87,000) ఇస్తారని, వారానికి ఆరు రోజుల పని (రోజుకు ఒక గంట ఓవర్ టైమ్) ఉంటుందని తెలిపారు. కన్‌స్ట్రక్షన్ హెల్పర్స్‌కు ప్రత్యేక విద్యార్హత అవసరం లేదని, ఐదేళ్ల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. వీరికి 850 యూరోలు (రూ.1,82,000) వేతనం చెల్లిస్తారని, వారానికి ఐదు రోజుల పని దినాలు (40 గంటలు) ఉంటాయని తెలిపారు. ఎంపికై న వారికి ఉచిత నివాసం, రవాణా, హెల్త్ ఇన్సూరెన్స్, సోషల్ సెక్యూరిటీ అందుబాటులో ఉంటాయన్నారు. గ్రీక్ చట్టం ప్రకారం ప్లంబింగ్ పోస్టుకు మాత్రమే సెలవులుంటాయన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు పేరు నమోదుకు ఈ నెల 10వ తేదీలోగా
https://naipunyam.ap.gov.in/program®istration లేదా skillinternational@apssdc.in emailకు వివరాలు తెలియజేయాలని మురళి తెలిపారు. మరిన్ని వివరాలకు 99888 53335, 87126 55686, 87901 18349, 87901 17279 నంబర్లలో కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలని సూచించారు.
గ్రీస్‌లో ఉద్యోగావకాశాలు


