
ఘనంగా పండిత సదస్యం
మధురపూడి: కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా మూడవరోజు బుధవారం సదస్యం నిర్వహించారు. మధ్యాహ్నం స్వామివారి కల్యాణ మండపంలో వేద పండితులు, ఉభయ వేదాంత పండితుల సమక్షంలో సదస్యం జరిగింది. ఉదయం గ్రామబలిహరణ, సాయంత్రం ఆరాధన, సర్వదర్శనములకు అనుమతి, సేవాకాలం జరిగింది. తీర్థ ప్రసాద గోష్ఠి కార్యక్రమంలో భాగంగా భక్తులకు బూరెలు అందజేశారు. రాత్రి శ్రీఆంజనేయ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పరాసర రంగరాజభట్టర్, అన్నవరం దేవస్థానం అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు.
ఆంజనేయ వాహనంపై
లక్ష్మీ నరసింహుని గ్రామోత్సవం

ఘనంగా పండిత సదస్యం