రూ.1,375.95 కోట్ల భృతి బకాయి | - | Sakshi
Sakshi News home page

రూ.1,375.95 కోట్ల భృతి బకాయి

Mar 12 2025 8:02 AM | Updated on Mar 12 2025 7:58 AM

గత ప్రభుత్వ హయాంలో..

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పేరిట ఏటా క్రమం తప్పకుండా ఆర్థిక సాయం అందించేవారు. విద్యా దీవెన కింద కళాశాలలను గ్రేడ్‌లుగా విభజించి, ఎ–ఏగ్రేడ్‌ కళాశాలలో చదివే వారికి ఏటా రూ.18,400, బి–గ్రేడ్‌ కళాశాలకు రూ.15,300 చొప్పున నాటి ప్రభుత్వం చెల్లించేది. నాలుగు విడతల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సొమ్ము విద్యార్థులు, తల్లుల ఉమ్మడి ఖాతాలో జమ చేసేది. దీంతో విద్యార్థులు ఫీజులు చెల్లించేవారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లలో జిల్లాలోని 70,241 మంది విద్యార్థులకు రూ.142.99 కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందించింది. వసతి దీవెన పథకం కింద 34,261 మంది విద్యార్థులకు చెందిన 30,559 మంది తల్లుల ఖాతాలో ఏటా రూ.32.61 కోట్లు జమ చేసేది. ఇలా నాలుగేళ్లలో 69,098 మంది విద్యార్థులకు రూ.65.56 కోట్ల మేర నాటి జగన్‌ ప్రభుత్వం అందించింది.

ఫ ఉద్యోగాల భర్తీ లేదు..

నిరుద్యోగ భృతీ లేదు

ఫ పైగా లక్షల ఉద్యోగాలిచ్చినట్లు బిల్డప్‌లు

ఫ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మంగళం!

ఫ కూటమి ప్రభుత్వ కుయుక్తులపై

వైఎస్సార్‌ సీపీ ఉద్యమ బాట

ఫ నేడు ‘యువత పోరు’ ఆందోళన

ఉద్యోగాల భర్తీ

నిరుద్యోగ భృతి

సాక్షి, రాజమహేంద్రవరం: ‘కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలిస్తాం. ఉద్యోగం వచ్చే వరకూ ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం తమ్ముళ్లూ..’ అంటూ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ. ప్రతి సభ, సమావేశంలో ఇదే విషయాన్ని ఊదరగొట్టారు. ఇలా నిరుద్యోగులను, యువతను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఆ ఊసే ఎత్తడం లేదు. గద్దెనెక్కి తొమ్మిది నెలలైనా ఆ హామీలకు అతీగతి లేదు. ఉద్యోగాల కల్పన కలగానే మిగిలింది. నిరుద్యోగ భృతికి మంగళం పాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎప్పుడిస్తారనే స్పష్టత కరువైంది. ఇలా విద్యార్థులను, నిరుద్యోగులను వంచిస్తున్న కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు వైఎస్సార్‌ సీపీ ఉద్యమ బాట పట్టింది. నిరుద్యోగ యువత, విద్యార్థుల పక్షాన సమరభేరి మోగించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి, వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ ‘యువత పోరు’ పేరిట బుధవారం ఆందోళన నిర్వహించేందుకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలు, నిరుద్యోగులు భారీ ర్యాలీ, కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించి, కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నారు.

నిరుద్యోగ ‘భ్రాంతి’

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీడీపీ ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీల్లో యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి మొదటి స్థానంలో ఉన్నాయి. కానీ, ఈ హామీల అమలుకు ఇప్పటికీ అతీగతి లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగాలు వచ్చేస్తాయని నమ్మి నిరుద్యోగులు, విద్యార్థులు ఉద్యోగాల సాధనపై దృష్టి సారించారు. పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపేందుకు కోచింగ్‌ సెంటర్ల బాట పడుతున్నారు. రూ.వేలల్లో ఫీజులు చెల్లించి మరీ శిక్షణ పొందుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేశారు. దానికే ఇంతవరకూ దిక్కు లేకుండా పోయింది. మిగిలిన ఉద్యోగాల భర్తీ ఊసే లేదు. దీంతో గత్యంతరం లేక పలువురు చిన్నచిన్న జీతాలకు ఉద్యోగాలు, చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఉద్యోగాల భర్తీకి నిరీక్షణ

జిల్లావ్యాప్తంగా 1,008 ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో 650కు పైగా ఉపాధ్యాయ ఖాళీలున్నట్లు గతంలో అధికారులు లెక్కలు తీశారు. అయితే 2025 డిసెంబర్‌ వరకూ ఏర్పడే ఖాళీలను అనుసరించి డీఎస్సీ పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. కానీ, ఇప్పటి వరకూ పోస్టుల భర్తీపై అతీగతి లేదు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మంగళం!

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల విడుదలపై కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వడం లేదు. గత ఏడాది ఆగస్టు నెలలో విడుదల చేస్తామన్నారే తప్ప నేటికీ విడుదల చేయలేదు. జిల్లావ్యాప్తంగా రూ.32.74 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం 34,764 మంది పేద విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తూండటంతో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం మంగళం పాడినట్లేనని తల్లిదండ్రులు భావిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీడీపీ ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీల్లో యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి మొదటి స్థానంలో ఉన్నాయి. కానీ, ఈ హామీల అమలుకు ఇప్పటికీ అతీగతి లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగాలు వచ్చేస్తాయని నమ్మి నిరుద్యోగులు, విద్యార్థులు ఉద్యోగాల సాధనపై దృష్టి సారించారు. పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపేందుకు కోచింగ్‌ సెంటర్ల బాట పడుతున్నారు. రూ.వేలల్లో ఫీజులు చెల్లించి మరీ శిక్షణ పొందుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేశారు. దానికే ఇంతవరకూ దిక్కు లేకుండా పోయింది. మిగిలిన ఉద్యోగాల భర్తీ ఊసే లేదు. దీంతో గత్యంతరం లేక పలువురు చిన్నచిన్న జీతాలకు ఉద్యోగాలు, చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

జిల్లావ్యాప్తంగా ఏటా సుమారు 12 వేల మంది ఇంటర్మీడియెట్‌ పూర్తి చేస్తున్నారు. దాదాపు 8 వేల డిగ్రీ పట్టా పుచ్చుకుని బయటకు వస్తున్నారు. బీటెక్‌, ఎంటెక్‌, డిప్లొమా కోర్సులు పూర్తి చేస్తున్న వారు మరో 2 వేల మంది వరకూ ఉంటున్నారు. వీరిలో కొందరు ఉద్యోగాలు చేస్తున్నా.. మరి కొందరు ఖాళీగా ఉంటున్న దుస్థితి. ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా నిరుద్యోగి ఉంటున్నారు. జిల్లాలో 5,09,611 కుటుంబాలు ఉన్నాయి. ఎన్నికల హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఉద్యోగం లేదా రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇలా ప్రతి నెలా రూ.152,88,33,000 చెల్లించాల్సి ఉంది. మొత్తం తొమ్మిది నెలలకు లెక్క వేస్తే రూ.1375,94,97,000 మేర ప్రభుత్వం భృతి రూపంలో చెల్లించాల్సి ఉంది.

నిరుద్యోగ ‘భ్రాంతి’

యువత పోరు

విజయవంతం చేద్దాం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేదా నిరుద్యోగ భృతి చెల్లించాలనే డిమాండుతో చేపడుతున్న ‘యువత పోరు’ ఆందోళనలో యువతీ యువకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి. వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకూ పార్టీ పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, యువతతో కలిసి భారీ బైక్‌ ర్యాలీ నిర్వహిస్తాం. కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తాం. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.

– చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ,

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి

జిల్లా జనాభా 18,32,332

మొత్తం కుటుంబాలు 5,09,611

ఏటా వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణులవుతున్న వారు

22,000

ఉద్యోగాలు లేదా

నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన వారు

5,09,611

9 నెలల్లో భృతి బకాయి

రూ.1375,94,97,000

ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి తూట్లు పొడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.4,600 కోట్ల బకాయిలు తక్షణం చెల్లించాలి. ఫీజుల కోసం కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాలు లేదా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ బడ్జెట్‌లో ఎక్కడా దీని ప్రస్తావన లేదు.

– షేక్‌ బాబా సలామ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా

నిరుద్యోగ భృతి ఇవ్వాలి

కూటమి ప్రభుత్వం వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలి. లేదా ప్రతి నెలా నిరుద్యోగ భృతి ఇవ్వాలి. దీనిపై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ప్రభుత్వ చేయూత లేక నిరుద్యోగులు చిన్నపాటి పనులకే పరిమితమవుతున్నారు.

– కోజారి లక్ష్మణరావు, బ్రాహ్మణగూడెం

రూ.1,375.95 కోట్ల భృతి బకాయి1
1/3

రూ.1,375.95 కోట్ల భృతి బకాయి

రూ.1,375.95 కోట్ల భృతి బకాయి2
2/3

రూ.1,375.95 కోట్ల భృతి బకాయి

రూ.1,375.95 కోట్ల భృతి బకాయి3
3/3

రూ.1,375.95 కోట్ల భృతి బకాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement