
దుర్గాప్రసాద్
బిక్కవోలు: మండలంలోని బలభద్రపురం గ్రామంలోని కాలువలో యువకుడు గల్లంతు అయినట్టు ఎస్సై పి.బుజ్జిబాబు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ రంగంపేట మండలం దొంతమూరు గ్రామానికి చెందిన పెరుమాళ్ల బాల విజయ దుర్గాప్రసాద్ (17) బలభద్రపురం గ్రామంలోని కాటన్‌దొర విగ్రహం వద్ద ఉన్న కాలువలో స్నానం చేయడానికి దిగాడు. కాలువ మధ్యలోకి వెళ్లగా ప్రవాహం వేగంగా రావడంతో కొట్టుకుపోయాడు. స్నేహితులు కాపాడడానికి ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదన్నారు. యువకుడు కేజీఆర్ కోళ్లఫారంలో పనిచేస్తున్నాడని తెలిపారు. తండ్రి పెరుమాళ్ళ నాగబాబు ఫిర్యాదు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.