బుల్లెట్‌ మాయం | - | Sakshi
Sakshi News home page

బుల్లెట్‌ మాయం

Jul 10 2023 7:32 AM | Updated on Jul 11 2023 7:56 AM

చోరీ అయిన బుల్లెట్‌  - Sakshi

చోరీ అయిన బుల్లెట్‌

తూర్పు గోదావరి: ఇంటి ముందు పార్కు చేసిన బుల్లెట్‌ చోరీకి గురైంది. స్థానిక మఠంసెంటర్‌లోని గంపల వారి వీధిలో నివాసం ఉంటున్న జి.సాయికృష్ణ పెద్దాపురంలో తన బావ బుల్లెట్‌ (ఏపీ05 ఈడీ 3534) తీసుకువచ్చి శనివారం రాత్రి ఇంటి ముందు పార్కు చేశాడు. ఊరు వెళ్లడం కోసం ఆదివారం ఉదయం చూడగా కనిపించలేదు.

వెంటనే ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా, ఆదివారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ముసుగు వేసుకున్న ఇద్దరు దొంగలు బుల్లెట్‌ను చోరీ చేసినట్టు గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ కె.దుర్గాప్రసాద్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement