అర్హులకు ఓటు హక్కు కల్పించండి | - | Sakshi
Sakshi News home page

అర్హులకు ఓటు హక్కు కల్పించండి

Nov 15 2026 1:14 PM | Updated on Nov 15 2026 1:14 PM

అమలాపురం రూరల్‌: తూర్పు, పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ ఓటర్ల జాబితా రూపకల్పనను పూర్తి పారదర్శకత చేపట్టాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ ఆదేశించారు. శనివారం అమలాపురంలోని కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఉపాధ్యాయ ఓటర్ల నమోదు ప్రక్రియ, ఫారం–19 ద్వారా అందిన దరఖాస్తుల పరిశీలన తదితర అంశాలపై కలెక్టర్‌ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఆరేళ్లలో కనీసం మూడేళ్లపాటు సెకండరీ పాఠశాల లేకుంటే అంతకంటే ఉన్నత స్థాయి విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులుగా పనిచేసిన వారు ఓటు నమోదుకు అర్హులని తెలిపారు. ఏదైనా దరఖాస్తును తిరస్కరించాల్సి వస్తే, కారణాలను స్పష్టంగా నమోదు చేయాలన్నారు. డిసెంబర్‌ 23న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, వచ్చే ఏడాది జనవరి 12న వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ ఉంటుందన్నారు . జిల్లాలో మొత్తం 2,469 ఉపాధ్యాయ ఓటరుకు దరఖాస్తుల స్వీకరించాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి వి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement