27, 28 తేదీల్లో నన్నయలో జాతీయ వర్క్‌షాప్‌ | - | Sakshi
Sakshi News home page

27, 28 తేదీల్లో నన్నయలో జాతీయ వర్క్‌షాప్‌

Nov 15 2026 1:14 PM | Updated on Nov 15 2026 1:14 PM

రాజానగరం: జాతీయ విద్యా విధానం లక్ష్యాలకు అనుగుణంగా భారతీయ భాషల అభివృద్ధి, విస్తరణతో పాటు పాఠ్య పుస్తకాల రూపకల్పన, బోధనలో ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని మరింత పెంపొందించేలా ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఈ నెల 27, 28 తేదీల్లో జాతీయ వర్క్‌షాప్‌ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ బ్రోచర్‌ను శనివారం వీసీ ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, భారతీయ భాష సమితి సహకారంతో యూనివర్సిటీలోని ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. కన్వీనర్‌గా హెచ్‌ఓడీ ఆచార్య కేఎస్‌ రమేష్‌, కో కన్వీనర్లుగా ఆచార్య డి.జ్యోతిర్మయి, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ బయోటెక్నాలజీ అధ్యాపకుడు ఆచార్య డి.మురళీధరరావు వ్యవహరిస్తారన్నారు.

విశ్రాంతి గదుల నిర్మాణానికి రూ.10 లక్షల విరాళం

ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో విశ్రాంతి గదుల నిర్మాణానికి హైదరాబాద్‌ (తెల్లాపూర్‌) వాస్తవ్యులు ఉండవల్లి వీర వెంకట రమణ, వెంకట సునీత, కుటుంబ సభ్యులు శనివారం రూ.10 లక్షల విరాళం సమర్పించారు. స్వామివారి దర్శనం అనంతరం వీరికి ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీసులు అందించారు. దాతలకు ఆలయ చైర్మన్‌ ముదునూరి వెంకటరాజు స్వామివారి చిత్రపటం అందజేశారు.

యువకుడి హత్య కేసు రీ కన్‌స్ట్రక్షన్‌

తాళ్లరేవు: పెదబొడ్డు వెంకటాయపాలెం యువకుడు సంగాడి కామేష్‌ వర్మ హత్య కేసుకు సంబంధించి కాకినాడ రూరల్‌ సీఐ చైతన్య కృష్ణ నేతృత్వంలో కోరంగి పోలీసులు శనివారం రీ కనస్ట్రక్షన్‌ చేశారు. అరెస్ట్‌ చేసిన నిందితుడిని ఘటనా స్థలానికి తీసుకువచ్చి వివరాలు తెలుసుకున్నారు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు కోరంగి పంచాయతీ పెదబొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన పాలెపు సతీష్‌, పినపోతు కేశవ, సంగాడి దుర్గామల్లేశ్వరరావు, సంగాడి కామేష్‌ వర్మ స్నేహితులు. వీరిలో సతీష్‌, కేశవ, మల్లేశ్వరరావు చేసిన దొంగతనాల గురించి కామేష్‌ గ్రామస్తులకు పోలీసులకు సమాచారం ఇస్తున్నాడన్న అనుమానంతో పైముగ్గురూ కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 28వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో కామేష్‌ ఇంటికి వెళ్లి, అతడిని తమ వెంట తీసుకువెళ్లారు. సీతారామపురం కోలాటివారి రేవు వద్ద కామేష్‌ను కొట్టి, పీక నొక్కి రేవులో పడవేశారు. ఆ నేరానికి సంబంధించి నిందితుల్లో ఒకడైన సంగాడి దుర్గామల్లేశ్వరరావును అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించగా, 14 రోజులు రిమాండ్‌ విధించారు. ఈ కేసుకు మిగిలిన ఇద్దరూ పలువురి దాడిలో గాయపడి కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందు తున్నారు.

ఉత్సాహంగాస్కూల్‌ గేమ్స్‌ ఎంపికలు

ప్రకాశం నగర్‌(రాజమహేంద్రవరం): ఆంధ్రప్రదేశ్‌ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండర్‌ 14 బాల, బాలికాల అథ్లెటిక్స్‌ ఎంపికలు శనివారం ఆర్ట్స్‌ కళాశాల క్రీడా మైదానంలో జరిగాయి. ఈ పోటీలకు జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి సుమారు 465 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 100, 200, 400, 600 మీటర్ల విభాగంతో పాటు 80 మీటర్ల హాడిల్స్‌, లాంగ్‌ జంప్‌, హైజంప్‌, షాట్‌ పుట్‌, డిస్కస్‌ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి కె.వాసుదేవరావు ముఖ్య అతిథిగా హాజరై, విజేతలకు బహుమతులు అందజేశారు. విజేతలు డిసెంబర్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement