యానాం: గోదారోళ్లకు పులస తర్వాత చీరమేను చేప రుచేవేరు. చిన్న సైజులో ఉండే చీరమేను చేప పేరు చెబితే అందరూ లొట్టలేసుకుని తింటారు. సీజనల్ చేప కావడంతో ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో శీతాకాలం ప్రారంభం సమయంలో ఇది గోదావరి నదీ ముఖద్వారం వద్ద అంటే గోదావరి (తీపినీరు), సముద్రం (ఉప్పునీరు) కలిసే ప్రదేశాల్లో వాటికి ఆక్సిజన్ ఎక్కువగా ఉండే బ్రాకిస్ వాటర్‌లో లభిస్తుంది. చీరమేనును సోల, సేరు, తవ్వ, గ్లాసు, బకెట్ కొలతల్లో అమ్ముతుంటారు. యానాం మార్కెట్‌లో లభిస్తుండటంతో మాంసాహార ప్రియులు చీరమేను కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు. శుక్రవారం ప్లాస్టిక్ బకెట్‌లో ఉన్న 10 కిలోల చీరమేను ధర రూ.26 వేలకు పలికింది.


