సాక్షి, అమలాపురం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో జిల్లాకు పెద్దపీట వేశారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ కమిటీ, వివిధ అనుబంధ విభాగాల్లో పదవులు భర్తీ చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఇందులో జిల్లాకు చెందిన 9 మందికి ప్రాధాన్యం కల్పించడం విశేషం. ముమ్మిడివరానికి చెందిన నేల కిషోర్ కుమార్‌ను రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమించారు. రాష్ట్ర అనుబంధ విభాగాల్లో నియమితులైన వారిలో కాలే రాజబాబు (ముమ్మిడివరం) కల్చరల్ వింగ్ జనరల్ సెక్రటరీగా, సానబోయిన మల్లికార్జునరావు (ముమ్మిడివరం) బీసీ సెల్ జనరల్ సెక్రటరీగా, జన శంకరరావు (రాజోలు) వీవర్స్ వింగ్ జనరల్ సెక్రటరీగా, కరెల్లా రమేష్ (అమలాపురం) వీవర్స్ వింగ్ సెక్రటరీగా, ముదునూరి వీవీ సత్యసుబ్బరాజు (ముమ్మిడివరం) వాణిజ్య విభాగం సెక్రటరీగా, దంగేటి రుద్ర, బొంతు గోవింద్‌శెట్టి (అమలాపురం) పంచాయతీరాజ్ వింగ్ సెక్రటరీలుగా, కుడుపూడి శివశంకరరావు (ముమ్మిడివరం) పంచాయతీరాజ్ వింగ్ జాయింట్ సెక్రటరీగా, చప్పిడి వెంకటేశ్వరరావు (అమలాపురం) వలంటీర్స్ వింగ్ సెక్రటరీలుగా నియమితులయ్యారు.
కాకుమానుకు నివాళి
అల్లవరం: గుంటూరులోని శాప్ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని గుండెపోటుకు గురై మృతి చెందిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ పార్ధివదేహాన్ని ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ సందర్శించారు. ఒంగోలులోని ఆయన నివాసం వద్ద రాజశేఖర్ పార్ధవదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజశేఖర్ మృతి పార్టీకి తీరని లోటుగా, పార్టీ కోసం నిస్వార్థంగా పని చేశారని ఇజ్రాయిల్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన వెంట ఏపీ ఎస్సీ సెల్ కార్యదర్శి పలివెల సుధాకర్, వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా జిల్లా కార్యదర్శి ఆకుమర్తి రమేష్, సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మంద దుర్గారావు, ఆకుమర్తి దుర్గారావు, కొండేటి సురేష్‌బాబు ఉన్నారు.
కొత్త కార్యవర్గం ఎన్నిక
అమలాపురం టౌన్: జిల్లా లైసెన్స్ టెక్నికల్ పర్సన్ (ఎల్‌టీపీ) ఇంజినీర్ల సంఘం సర్వసభ్య సమావేశం స్థానిక యెండూరి కన్వెన్షన్ హాలులో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా సంఘ నూతన కార్యవరాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా సంఘ అధ్యక్షుడిగా ఐ.బాలకృష్ణ, కార్యదర్శిగా మలిశెట్టి నాగేశ్వరరావు, కోశాధికారిగా సుదర్శనం శ్రీకాంత్‌లను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఎల్‌టీపీ ఏపీ జనరల్ సెక్రటరీ పీవీఎన్ మాణిక్యాలరావు అభినందించారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గం నుంచి అరిగెల సుబ్బారావు, ఏడిద దొరబాబు, కొవ్వూరి రామచంద్రారెడ్డి, శ్రీనివాసరావు, వి.కన్నబాబు, కృష్ణంరాజు తదితరులు ప్రసంగించారు.
నేడు ‘5కే రెడ్ రన్’ మారథాన్
అమలాపురం రూరల్: యువత, ప్రజల్లో హెచ్‌ఐవీ, ఎయిడ్స్, లైంగిక సంక్రమిత వ్యాధులపై సమగ్ర అవగాహన కల్పించేందుకు అమలాపురంలో శనివారం ‘5కే రెడ్ రన్’ మారథాన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. ఈ మారథాన్ శనివారం ఉదయం 6 గంటలకు భట్నవిల్లి హైవే వద్ద ప్రారంభమై, ఐదు కిలోమీటర్ల మేర కొనసాగుతుందని తెలిపారు.
వీఆర్‌ఏల వినూత్న నిరసన
కొత్తపేట: స్థానిక పాత తహసీల్దార్ కార్యాలయం వద్ద మండల వీఆర్‌ఏలు వివిధ రీతుల్లో నిరసన తెలియజేసిన విషయం తెలిసిందే. 10వ రోజు మెయిన్ రోడ్డులో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. రోడ్డున పడ్డాం.. ఆకలితో అలమటిస్తున్నాం.. భిక్షం వేయండి బాబూ అంటూ వ్యాపారులను వీఆర్‌ఏలు వేడుకుంటూ నిరసన తెలిపారు. మండల సంఘ అధ్యక్షుడు కె.భీమశంకరం, ప్రధాన కార్యదర్శి పిల్లంగోరు బాలు, కోశాధికారి ఎస్.నాగభూషణం తధితరులు పాల్గొన్నారు.


