అమలాపురం టౌన్: జిల్లాలోని మొత్తం 146 మద్యం దుకాణాలకు 12 దుకాణాలు తప్ప మిగిలిన 134 దుకాణాలు రెన్యువల్ అయ్యాయి. 12 దుకాణాలు రెన్యూవల్ కాకపోవటంతో ఎకై ్సజ్ శాఖ ఆ దుకాణాల లైసెన్స్‌ల మంజూరుకు నోటిఫికేషన్ జారీ చేసిందని జిల్లా ఎకై ్సజ్ అధికారి ఆర్‌ఎస్ కుమారేశ్వరరావు తెలిపారు. 2026–27 సంవత్సరానికి రెన్యువల్ అనంతరం 12 దుకాణాల లైసెన్స్‌ల మంజూరుకు ఈ నోటిఫిషన్ విడుదలైందన్నారు. లైసెన్స్‌ల కాల పరిమితి 2026 అక్టోబర్ 1 నుంచి 2027 సెప్టెంబర్ 30వ తేదీ వరకూ ఉంటుందని అన్నారు. ఆసక్తి గల దరఖాస్తుదారులు వచ్చే నెల 1వ తేదీ రాత్రి 12 గంటలలోపు ఆన్‌లైన్ లేకుంటే, ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఒక్కో దరఖాస్తుకు రూ. 3,00,000 దరఖాస్తు రుసుం ఉంటుందని, ఈ మొత్తాన్ని జిల్లా ఎకై ్సజ్ అధికారి పేరుతో చెల్లించాలన్నారు. అదనంగా రూ.1000 ప్రాసెసింగ్ ఫీజును కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్, ఏపీ మంగళగిరి పేరుతో తీయాలన్నారు. అమలాపురం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అమలాపురం 1, కొత్తపేట ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో కొత్తపేట 3 దుకాణాలు, రాజోలు ఎకై ్సజ్ స్టేషన్‌లో రాజోలు 2 దుకాణాలు, రామచంద్రపురం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో రామచంద్రపురం 6 దుకాణాలు, ఆలమూరు ఎకై ్సజ్ స్టేషన్‌లో ఆలమూరులో ఒక దుకాణానికి దరఖాస్తులు సమర్పించాలన్నారు. దరఖాస్తుల పరిశీలన వచ్చే నెల 5వ తేదీ ఉదయం 8 గంటలకు అమలాపురం కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో జిల్లాలోని 12 దుకాణాలకు లాటరీ ద్వారా ఎంపిక ఉంటుంది. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమక్షంలో ఈ ప్రక్రియ నిర్వహిస్తారు. కోనసీమ జిల్లాలో 12 దుకాణాలకు లైసెన్స్‌లు మంజూరు కావాల్సి ఉండగా, ఒక దుకాణం మాత్రం తూర్పుగోదావరి జిల్లా ఎకై ్సజ్ పరిధిలో ఆలమూరు మండలం మద్యం లైసెన్స్ దుకాణం ఉందని కుమారేశ్వరరావు వివరించారు. జిల్లా ఎకై ్సజ్ శాఖ గణంకాల ఆధారంగా మొత్తం 13 దుకాణాలుగా నమోదు చేశారని తెలిపారు.
ఫ 1 వరకూ దరఖాస్తుల స్వీకరణ
ఫ 5న లాటరీ విధానంలో ఎంపిక


