పథకాలకు సొమ్ములు లేవంటూ.. | - | Sakshi
Sakshi News home page

పథకాలకు సొమ్ములు లేవంటూ..

Sep 26 2026 12:26 AM | Updated on Sep 26 2026 12:26 AM

సంక్షేమ పథకాలకు నిధులు లేవంటున్న ప్రభుత్వం సోషల్‌ మీడియా ప్రచారానికి ప్రత్యేక పాలసీ తీసుకురావడం దారుణం. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజాధనాన్ని ప్రచారానికి వినియోగించడం సరికాదు. ఈ నిర్ణయం సరైంది కాదు.

– ఎస్‌.రాంజీ హర్షవర్ధన్‌,

బీటెక్‌, కొమరగిరి, ఐ.పోలవరం మండలం

ముందు పథకాలు

అమలు చేయండి

ఎన్నికల ముందు చాలా పథకాలు అమలు చేస్తామన్నారు కదా. ముందు వాటిని ప్రజలకు అందించడం ముఖ్యం. పింఛన్ల కోసం ఇప్పుడు దరఖాస్తులు అడిగారు. ఎప్పుడు ఇస్తారనేది మాత్రం చెప్పడం లేదు. ప్రభుత్వం ప్రజా ప్రయోజన కార్యక్రమాలు అమలు చేయాలి.

–పితాని ఏసుబాబు,

సూర్యానగర్‌, అమలాపురం మున్సిపాలిటీ

ఆడబిడ్డ నిధి

ఎప్పుడిస్తావ్‌ బాబూ..

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పింఛన్‌ వంటివి అమలు చేయకుండా సోషల్‌ మీడియా ప్రచారానికి ప్రజాధనం ఖర్చు చేయడం దారుణం. గతంలో డ్వాక్రా రుణమాఫీ అని ఓట్లేయించుకుని మోసం చేశారు. ఇప్పుడు ఆడబిడ్డ పేరుతో మరోసారి మోసం చేస్తున్నారు.

– కర్రా లక్ష్మి, కొత్తపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement