ఇక కోనసీమ జెడ్పీ | - | Sakshi
Sakshi News home page

ఇక కోనసీమ జెడ్పీ

Sep 25 2026 12:53 AM | Updated on Sep 25 2026 12:53 AM

సాక్షి, అమలాపురం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ వ్యవస్థలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ఉమ్మడి జిల్లా పరిషత్‌ నాలుగు జిల్లా పరిషత్‌లుగా విడిపోయి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిషత్‌ కొత్తగా ఏర్పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 115, 116 ప్రకారం జిల్లాకు 19 మండలాలతో శుక్రవారం నుంచి కొత్త జిల్లా పరిషత్‌ పరిపాలన మొదలుకానుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో దాని పరిధి మారుతోంది. కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పోలవరం జిల్లాల పరిధిలో కొత్త జిల్లా పరిషత్‌లు ఏర్పడుతున్నాయి. దీంతో స్థానిక సంస్థల పరిపాలన మరింత వికేంద్రీకృతం కానుంది. ఇక నుంచి ఆయా జిల్లాల పరిధిలోనే జెడ్పీ వ్యవహారాలు కొనసాగనున్నాయి. కోనసీమ జిల్లా పరిషత్‌కు అమలాపురం ఎంపీడీవో కార్యాలయాన్ని కేంద్రంగా నిర్ణయించారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిషత్‌ పరిధిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని కొత్త జిల్లా పరిషత్‌లకు మండలాల నిష్పత్తి ఆధారంగా కేటాయించే ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. దీంతో కొత్త జెడ్పీ కార్యాలయ నిర్వహణకు అవసరమైన సిబ్బంది అందుబాటులోకి రానున్నారు.

కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పాలన..

కొత్త జిల్లా పరిషత్‌కు ప్రత్యేకాధికారిగా జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. అధికారికంగా జీవో రావాల్సి ఉంది. జిల్లా పరిషత్‌ విభజన ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని పేర్కొన్న విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లా పరిషత్‌ పాలకవర్గం గడువు గురువారం రాత్రితో ముగియడంతో ఎన్నికై న జెడ్పీ పాలకవర్గం ఏర్పడే వరకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో పరిపాలన కొనసాగనుంది. కొత్త జిల్లా పరిషత్‌ కార్యాలయంలో పరిపాలనాపరమైన విధులు నిర్వహించేందుకు సీఈవోతో పాటు అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, టైపిస్టులు, ఆఫీస్‌ సబార్డినేట్లు పనిచేయనున్నారు. జిల్లా పరిషత్‌ పరిపాలన, కార్యాలయ వ్యవహారాలు, రికార్డుల నిర్వహణ, ఉత్తర ప్రత్యుత్తరాలు తదితర బాధ్యతలను వీరు నిర్వహించనున్నారు.

19 మండలాలతో ఏర్పాటు

అమలాపురం ఎంపీడీవో

కార్యాలయం కేంద్రంగా పరిపాలన

ప్రత్యేకాధికారిగా

జిల్లా కలెక్టర్‌ నియామకం

అధికారుల వికేంద్రీకరణ పూర్తి

నేటి నుంచి ప్రత్యేక పాలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement