అమలాపురం టౌన్: అక్టోబర్ నాలుగున రాజమహేంద్రవరంలో జరగనున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గోదావరి మహా గర్జనను విజయవంతం చేయాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ జిల్లా కార్యవర్గ ప్రతినిధులు పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ప్రాంగణంలో గురువారం జరిగిన నిరసన కార్యక్రమంలో వారు ప్రసంగించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అనంతరం గోదావరి మహా గర్జన పోస్టర్లను ఆవిష్కరించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల స్థాయిలో రాజమహేంద్రవరంలో జరగనున్న ప్రాంతీయ మహా గర్జన సదస్సుకు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తరలిరావాలని జేఏసీ నేత నూకపెయ్యి గంగాధర్ విజ్ఞప్తి చేశారు. జేఏసీ ప్రతినిధులు పి.నాగలక్ష్మి, నాగారపు శ్రీనివాసరావు, సుమతి, అనంతకుమారి, సీహెచ్ కృష్ణ సురేష్, బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్
ఉద్యోగుల జేఏసీ పిలుపు


