వేడుకగా బాలబాలాజీ స్వామి మాస కల్యాణం | - | Sakshi
Sakshi News home page

వేడుకగా బాలబాలాజీ స్వామి మాస కల్యాణం

Sep 24 2026 2:06 AM | Updated on Sep 24 2026 2:06 AM

మామిడికుదురు: అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి మాస కల్యాణాన్ని బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ ఈ ఉత్సవం అత్యంత వేడుకగా జరిగింది. స్వామి వారి జన్మనక్షత్రం శ్రవణం కావడంతో ఆలయంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. కల్యాణోత్సవాన్ని ఈఓ ఎం.రాంబాబురెడ్డి పర్యవేక్షించారు.

భారతీయ సంస్కృతికి

మూలస్తంభాలు వేదాలు

అమలాపురం టౌన్‌: భారతీయ సంస్కృతికి నాలు గు వేదాలు మూల స్తంభాలని ఘనపాఠులు అన్నారు. అమలాపురం సత్యసాయి కల్యాణ మండపంలో బుధవారం జరిగిన 64వ కోనసీమ వేద శాస్త్ర సన్మాన సభలో వారు ఉపన్యసించారు. సభకు అధ్యక్షత వహించిన దువ్వూరి ఫణి యజ్ఞేశ్వర సోమయాజులు ఘనపాఠి మాట్లాడుతూ, అనంతమైన జ్ఞానాన్ని వ్యాస మహర్షి రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలుగా విభజించారని చెప్పారు. శృంగేరి ఆస్థాన విద్వాంసుడు విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి వేద సభ విశిష్టత గురించి వివరించారు. ప్రవా రామకృష్ణ సోమయాజి వైదిక ధర్మం – విశ్వ మానవ శ్రేయ స్సు అనే అంశంపై ప్రసంగించారు. టీటీడీ పాలక మండలి సభ్యుడు విష్ణుభట్ల నాగ శంకర వేంకట లక్ష్మీనారాయణ ఘనపాఠి వైదిక వాఙ్మయం విశిష్టతను విశ్లేషించారు. తంగిరాల సుబ్రహ్మణ్య సో మయాజులు అధర్వణ వేదం, యజుర్వేద క్రమంపై అనుగ్రహ భాషణం చేశారు. వడ్లమాని సుబ్రహ్మణ్య ఘనపాఠి వేద రక్షణ ఆవశ్యకతను వివరించారు. గుళ్లపల్లి సీతారామ శ్రీహర ఘనపాఠి వేద విద్యార్థులకు వేదాధ్యయనం గురించి చెప్పారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 200 మంది వేద పండితులు ఈ వేద సభకు హాజరయ్యారు. కడియాల వేంకట సత్య సీతారామ ఘనపాఠి ఆధ్వర్యాన ఒకేసారి 200 మంది వేద పండితులు ఏకకంఠంతో చెప్పిన వేదస్వస్తితో అమలాపురం పట్టణం పులకించింది. అనంతరం వేద పండితులను సత్కరించారు. శ్రీ కోనసీమ వేద శాస్త్ర సన్మాన సభ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు గుళ్లపల్లి ప్రభాకర ఫణి రాజా, గుళ్లపల్లి వెంకట్రామ్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

జనగణన హౌస్‌ లిస్టింగ్‌

ప్రక్రియ నూరు శాతం పూర్తి

అమలాపురం రూరల్‌: జనగణనలో భాగంగా మొదటి దశలో హౌస్‌ లిస్టింగ్‌ ప్రక్రియ జిల్లాలో నూరు శాతం పూర్తి చేశామని జిల్లా రెవెన్యూ అధి కారి (డీఆర్‌ఓ) వి.సుబ్బారావు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి జనగణన డైరెక్టర్‌ జె.నివాస్‌ అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌ నుంచి ఆయన పాల్గొన్నారు. మొత్తం జనగణన ప్రక్రియలో డేటా నాణ్యత కచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. సమావేశంలో సెన్సస్‌ జిల్లా ఇన్‌చార్జి తరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

దోపిడీ కేసులో

ఇద్దరికి మూడేళ్ల జైలు

కొత్తపేట: దోపిడీ కేసులో ఇద్దరు నిందితులకు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ అమలాపురం రెండో అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి జి.చంద్రమౌళీశ్వరి బుధవారం తీర్పు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం.. వానపల్లికి చెందిన కుక్కునూరి సూరిబాబుపై 2013 ఫిబ్రవరి 3వ తేదీ అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడి చేసి, సెల్‌ఫోన్‌, రూ.6 వేల నగదు దోచుకెళ్లారు. అయినవిల్లి మండలం నేదునూరుకు చెందిన సానబోయిన ప్రసా ద్‌, అంబాజీపేటకు చెందిన ఖండవల్లి సూరిబా బు, కాగిత శ్రీనులను నిందితులుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసు అప్పీల్‌ సమయంలో కాగిత శ్రీను అనారోగ్యంతో మృతి చెందాడు. విచారణ అనంతరం మిగిలిన ఇద్దరు నిందితులకు మూడేళ్ల చొప్పున జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఎస్పీ రాహుల్‌ మీనా, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్‌ పర్యవేక్షణలో రావులపాలెం రూరల్‌ సీఐ సీహెచ్‌ విద్యాసాగర్‌, కొత్తపేట ఎస్సై జి.సురేంద్ర, కోర్టు హెడ్‌ కానిస్టేబుల్‌ జి.ప్రభాకరరావులు సాక్షులను సమర్థవంతంగా కోర్టులో ప్రవేశపెట్టారు. అడిషనల్‌ పీపీ అడపా ప్రసాద్‌ ప్రాసిక్యూషన్‌ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement