వినాయక చవితి పర్వదినం మొదలు తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణనాథుడు తిరిగి గంగమ్మ ఒడిని చేరి.. అక్కడి నుంచి తల్లిదండ్రుల చెంతకు పయనమవుతున్నాడు. జిల్లావ్యాప్తంగా వేలాది మండపాల్లో కొలువుదీరి, పూజలందుకున్న గణేశుని నిమజ్జనోత్సవాలను భక్తులు బుధవారం కోలాహలంగా నిర్వహించారు. ఎడతెరిపి లేని వర్షాన్ని సైతం లెక్క చేయకుండా.. బాజాభజంత్రీలు, నృత్యాలు, బాణసంచా కాల్పుల నడుమ భారీ ఊరేగింపులు నిర్వహిస్తూ.. గోదావరి పాయలు, కాలువల్లో ఏకదంతుని విగ్రహాలను నిమజ్జనం చేశారు.
– కె.గంగవరం
వినాయకుని విగ్రహాన్ని పడవపై తీసుకెళ్లి, గౌతమీ గోదావరిలో నిమజ్జనం చేస్తున్న భక్తులు


