అమలాపురం రూరల్: ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఆర్‌ఎస్‌ఏ) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అమలాపురం తహసీల్దార్ వీఎస్ దివాకర్ నాలుగోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలోని అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో ఈ ఎన్నిక జరిగింది. ఉపాధ్యక్షుడిగా ఎన్నికై న నేపథ్యంలో కలెక్టర్ మహేష్ కుమార్‌ను దివాకర్ కలెక్టరేట్‌లో మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆయనను కలెక్టర్ సత్కరించి, అభినందనలు తెలిపారు. ఉద్యోగ సంఘం బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అమలాపురం ఆర్‌డీఓ సరళావతి, సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, అమలాపురం డివిజన్ అధ్యక్షుడు పలివెల అశోక్ ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇబ్రహీం, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు సాధనాల ఏలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
హైవేపై అక్రమంగా పార్కింగ్
ఫ రవాణా శాఖ మెరుపు దాడులు
ఫ 15 వాహనాలపై కేసులు
అమలాపురం రూరల్: పేరూరు, పాశర్లపూడి, కూడలి వద్ద 216వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాల అక్రమ పార్కింగ్‌పై రవాణా శాఖ మంగళవారం మెరుపు దాడులు చేసింది. హైవేపై అనధికారికంగా నిలిపి ఉంచిన 15 రవాణా వాహనాలపై కేసులు నమోదు చేసి, రూ.45,500 అపరాధ రుసుం విధించినట్లు జిల్లా రవాణా శాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. రహదారి భద్రత ఉల్లంఘన కింద అక్రమంగా నిలిపిన బస్సులు, ట్రాక్టర్లు, ఇసుక లారీలపై కేసులు నమోదు చేసి, వాటిని అక్కడి నుంచి తొలగించామని పేర్కొన్నారు. ఇటీవల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాలకు అక్రమంగా నిలిపిన వాహనాలే కారణమని అన్నారు. ఆయా ప్రదేశాల్లో వెంటనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు, రవాణా, ఎన్‌హెచ్‌ఏఐ సమన్వయంతో రోడ్డు ప్రమాదాలను అరికట్టే దిశగా కృషి చేస్తామని డీటీఓ తెలిపారు. తనిఖీల్లో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు రవికుమార్, కౌశిక్ పాల్గొన్నారు.


