8 మండలాల్లో కరవు ప్రభావం | - | Sakshi
Sakshi News home page

8 మండలాల్లో కరవు ప్రభావం

Sep 23 2026 12:13 AM | Updated on Sep 23 2026 12:13 AM

అమలాపురం రూరల్‌: జిల్లాలోని ఎనిమిది మండలాల పరిధిలో మాత్రమే వరి సాగుపై కరవు ప్రభావం కొంత మేరకు ఉందని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ తెలిపారు. జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం, భూగర్భ జలాల పరిస్థితి, సాగునీటి వనరులు, వర్షపాతం తదితర అంశాలపై కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాల సాధారణ గణాంకాల ఆధారంగా కొన్ని ప్రాంతాల్లో కరవు పరిస్థితులు నమోదవుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, క్షేత్ర స్థాయి నిజ నిర్ధారణ సూచికల ఆధారంగా వరి పంటపై ప్రస్తుతం గణనీయమైన కరవు ప్రభావం లేదని చెప్పారు. వరి సాగు పరిస్థితులు, పంటపై వర్షాభావ ప్రభావం తదితర అంశాలను క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఆ గణాంకాల ఆధారంగా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. లోటు వర్షపాతం నేపథ్యంలో పశుగ్రాసం, పశు పోషణకు సంబంధించిన పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ప్రస్తుత భారీ వర్షాల కారణంగా పంటలు, ఆస్తులకు నష్టం వాటిల్లకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.సుబ్బారావు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఎం.మురళీకృష్ణ, జిల్లా పశు సంవర్ధక, వ్యవసాయ, మత్స్యశాఖల అధికారులు బి.నాగేశ్వరరావు, ఎం.వెంకట రామారావు, ఎ.కరుణాకరరావు తదితరులు పాల్గొన్నారు.

క్షేత్ర స్థాయికి వెళ్తేనే

పీజీఆర్‌ఎస్‌ సమస్యలు పరిష్కారం

అమలాపురం రూరల్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)లో వస్తున్న సమస్యలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తేనే పరిష్కారమవుతాయని డివిజన్‌, మండల స్థాయి అధికారులకు కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌, భూ ప్రధాన పరిపాలన అధికారి జయలక్ష్మి రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ, 22–ఎ నిషేధిత భూముల రీ సర్వే పనులు వేగవంతం చేసి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మడ అడవుల భూముల రీ సర్వే పనులు కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement