పులస @ రూ.26 వేలు | - | Sakshi
Sakshi News home page

పులస @ రూ.26 వేలు

Sep 23 2026 12:13 AM | Updated on Sep 23 2026 12:13 AM

యానాం: పుస్తెలు అమ్మి అయినా పులస చేప తినాలనే నానుడి గోదావరి జిల్లాల్లో ఉంది. కానీ, ప్రస్తుతం పుస్తెలు అమ్మితే వచ్చే సొమ్ము కూడా సరిపోని రీతిలో వీటి ధరలు పలుకుతున్నాయి. యానాం వద్ద గౌతమీ గోదావరిలో మంగళవారం మత్స్యకారుల వలకు చిక్కిన పులస చేపకు రూ.26 వేల అత్యధిక ధర పలికింది. స్థానిక పుష్కర ఘాట్‌ వద్ద నిర్వహించిన వేలం పాటలో ఈ చేపను కోటిపల్లికి చెందిన మత్స్యకారుడు రూ.26 వేలకు దక్కించుకుని, తిరిగి మరో వ్యక్తికి రూ.27 వేలకు విక్రయించాడు. ఈ సీజన్‌లో అత్యధిక ధర పలికిన పులస ఇదే కావడం విశేషం. గోదావరికి ఎర్రనీరు రావడంతో ఆగస్టు నుంచి సెప్టెంబర్‌ వరకు పులస చేపలు పడుతూంటాయి. ఈ సీజన్‌లో చాలా తక్కువగానే పులసలు పడ్డాయి. దీంతో, వీటి ఖరీదు వేల రూపాయలు పలుకుతోంది. సామాన్యులకు అందనంత భారీ ధరలో ఈ చేప ఉందని పులస ప్రియులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement