ఎస్‌జీఎఫ్‌ (బాలికల) జిల్లా సెక్రటరీగా ఉషారాణి | - | Sakshi
Sakshi News home page

ఎస్‌జీఎఫ్‌ (బాలికల) జిల్లా సెక్రటరీగా ఉషారాణి

Sep 20 2026 12:09 AM | Updated on Sep 20 2026 12:09 AM

కొత్తపేట: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) బాలికల విభాగం జిల్లా సెక్రటరీగా మండలంలో పలివెల జెడ్పీ హైస్కూలు పీడీ య ర్రంశెట్టి శేషసత్య ఉషారాణి నియమితులయ్యారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఉషారాణి శనివారం తెలిపారు. ఖో–ఖో క్రీడలో 8 సార్లు జాతీయ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారిణి అయిన ఉషారాణి వ్యాయామ ఉపాధ్యాయినిగా 1996లో సర్వీస్‌లో చేరారు. ఆమెను ఎంఈఓలు మట్టపర్తి హరిప్రసాద్‌, కే లీలావతి, పలివెల పాఠశాల హెచ్‌ఎం ఇందిరాబాయి తదితరులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement