ఫ రోడ్డు ప్రమాదాలపై సదస్సులు
నిర్వహించాలి
ఫ పోలీసు అధికారులతో కలెక్టర్, ఎస్పీ
అమలాపురం టౌన్: కేసుల దర్యాప్తులో నాణ్యత, ఆధారాల సేకరణ, కోర్టుల విచారణలో సమర్థవంతమైన ప్రాసిక్యూషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసు అధికారులకు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం జరిగిన హాఫ్ ఇయర్లీ క్రైమ్ రివ్యూ సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ జామ్ ద్వారా సమావేశాన్ని ఉద్దేశించి జిల్లాలో నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు వివరించారు. జిల్లాలో జాతీయ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేసే స్థలాలను ముందుగా గుర్తించి, సంబంధించిన శాఖల అధికారుల సమన్వయంతో తగిన నిర్ణయం తీసుకోవాలని ఐజీ ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్ధులకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవ గాహన సదస్సులు విస్తృతంగా నిర్వహించాలని జిల్లా రవాణాశాఖ అధికారులకు ఎస్పీ మీనా సూచించారు. పోలీసింగ్‌లో ఆధునిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. సమావేశంలో ప్రాసిక్యూషన్, రెవెన్యూ, మెడికల్, ట్రాన్స్‌పోర్టు, పోలీస్, ఎకై ్సజ్, ఎండోమెంట్, ఎస్సీ, బీసీ వెల్ఫేర్ శాఖల అధికారులు పాల్గొని జిల్లా నేర నియంత్రణకు తీసుకోవాల్సిన అంశాలపై వారి అభిప్రాయాలను తెలిపారు.


