సామాన్యులకేదీ రక్షణ? | - | Sakshi
Sakshi News home page

సామాన్యులకేదీ రక్షణ?

Aug 12 2026 12:16 AM | Updated on Aug 12 2026 12:16 AM

పిఠాపురం: రెండేళ్లుగా నేతన్నలకు పైసా కూడా విదల్చని కూటమి ప్రభుత్వం మూడో ఏట ముచ్చటగా గతంలో కంటే ఒక రూ.వెయ్యి పెంచి నేతన్న సేవ పేరుతో నేత కార్మికులకు ఆర్థిక సహాయం చేయడానికి ఏర్పాట్లు చేసింది. అయితే ఈ పథకంలో లబ్ధిదారుల ఎంపికలో కొందరు చేతివాటానికి పాల్పతున్నారని, భారీగా ముడుపులు చెల్లిస్తేనే అర్హుల జాబితాలో పేరు ఉంటుందన్న చెబుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరికి నేతన్న సేవ పథకంలో నిధులు విడుదల కాగా, చాలా మంది నేత కార్మికులకు జమ కాలేదు. దీంతో తమకు ఎందుకు రాలేదని అధికారుల వద్దకు వెళితే అర్హతను బట్టి రేట్లు నిర్ధారించి, ముడుపులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విడుదల కాని జాబితా

సాధారణంగా ఏదైనా ప్రభుత్వ పథకం నిధులు విడుదలైనప్పుడు దానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాలను వెంటనే విడుదల చేస్తుంటారు. కానీ నేతన్న సేవ పథకంలో మాత్రం నిధులు విడుదల చేసి రోజులు గడుస్తున్నా అర్హుల జాబితాలను బయటపెట్టక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చాలామంది నేత కార్మికులు తమకు నేతన్న సేవలో డబ్బులు పడక పోవడంతో చేనేత జౌళి శాఖ అధికారులను సంప్రదిస్తే వెంటనే తమ కార్యాలయానికి రమ్మని వివరాలు నమోదు చేస్తామంటూ పిలుపు వస్తున్నట్లు చెబుతున్నారు. తీరా అక్కడకు వెళ్లాక మగ్గం ఉంటే రూ.3 వేలు, మగ్గం లేకపోతే రూ.5 వేలు వసూలు చేస్తున్నారని, అలా ముడుపులు ఇచ్చిన వారికే వివరాలు నమోదు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కొత్త జాబితా పేరుతో..

పథకం ప్రారంభానికి ముందే అర్హుల జాబితాను తయారు చేసిన అధికారులు ఇప్పుడు కొత్తగా లిస్టులు తయారు చేస్తున్నట్టుగా చూపించి భారీగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చాలామంది నేత పని మానేసి ఇతర వృత్తుల్లో ఉండగా వారందరి పేరున నేతన్న సేవ పథకం ఇప్పించేలా ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. అలా వారిని నేత నేస్తున్న వారిగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

దరఖాస్తుల స్వీకరణలోనే దోపిడీకి తెర

ఏదైనా ఒక ప్రభుత్వ పథకాన్ని అమలు చేయాలంటే లబ్ధిదారుల అర్హతలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. కానీ నేతన్న సేవ పథకానికి మాత్రం ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్గదర్శకాలు లేవని అధికారులు చెబుతున్నారు. దీంతో పాత జాబితాలను కొనసాగిస్తారనే ప్రచారం జరుగుతోంది. నేత కార్మిక కుటుంబాలకు ఇచ్చిన ఉచిత విద్యుత్‌ పథకంలో లబ్ధిదారులకు ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే అద్దె భవనాల్లో ఉన్న వారి పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. దీంతో పాటు ఎటువంటి నేత నేయని వారు కూడా ఉచిత విద్యుత్‌ పథకంలో ఉండడంతో అనర్హులకు లబ్ధి చేకూరుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భారీగా వసూళ్లు

ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన పథకం అమలు చేయడంతో కొందరు అధికారులు, పార్టీ నాయకులతో కలిసి వసూళ్లకు తెరలేపారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మార్గదర్శకాలు లేకపోవడంతో తాము రాసిన వారికి మాత్రమే పథకం వస్తుందని, దానికి తగిన డబ్బులు సమర్పించుకోవాలని కొందరు సిబ్బంది బాహాటంగా చెబుతున్నట్లు సమాచారం. దీంతో ముడుపులుగా ఇచ్చిన రూ.5 వేలు పోయినా మరో రూ.20 వేలు మిగులుతుంది కదా అని అర్హత ఉన్న లబ్ధిదారులు సైతం అధికారులు అడిగిన డబ్బులు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు.

రేపటి నుంచి సత్యదేవుని

జయంత్యుత్సవాలు

అన్నవరం: వీర వేంకట సత్యనారాయణస్వామివారి జయంత్యుత్సవాలకు దేవస్థానం ముస్తాబైంది. గురువారం నుంచి రెండు రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. తొలిరోజు ఉదయం 8.30 గంటలకు ఆలయంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలతో వేడుకలు మొదలవుతాయి. ఈసారి సత్యదేవుని జన్మ నక్షత్రం ‘మఖ’ కూడా స్వామివారి జయంత్యుత్సవం నాడు రావడం విశేషం. శుక్రవారం తెల్లవారుజామున సత్యదేవుడు, అమ్మవార్లకు, శివలింగానికి పంచామృతాలతో మహాన్యాశపూర్వక అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం ఏడు గంటల నుంచి 11 గంటల వరకు జపతపాలు, పారాయణలు, మూల మంత్రజపాలు నిర్వహిస్తారు. సత్యదేవుని జయంత్యోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం 20 మంది పండితులను ఘనంగా సత్కరించనున్నారు. కాగా.. స్వామివారి ఆలయం, రాజగోపురాలు, రామాలయం, ఆలయ ప్రాంగణాన్ని రంగు రంగుల విద్యుద్దీపాలు, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. రత్నగిరిపై తూర్పు, పశ్చిమ రాజగోపురాలు రంగురంగుల విద్యుత్‌ దీపాల అలంకరణతో శోభాయమానంగా ప్రకాశిస్తున్నాయి.

హత్యాయత్నం కేను నమోదు

జేసీబీతో తమ ఇంటిని కోట చంద్రశేఖర్‌, దేశాల జయరామ్‌తో పాటు జేసీబీ డ్రైవర్‌ కూల్చివేసి, ధ్వంసం చేశారంటూ బాధితురాలి కుమార్తె శివల దుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యాయత్నంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని టౌన్‌ సీఐ జి.రమేష్‌బాబు తెలిపారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటనలో రూ.లక్ష వరకూ ఆస్తినష్టం జరిగిందన్నారు. కేసు విచారణ జరుగుతోందని, నిందితులు పరారీలో ఉన్నారని అన్నారు.

జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి

బాధ్యుల్ని తక్షణం అరెస్టు చేయాలి

వైఎస్సార్‌ సీపీ నేత జగ్గిరెడ్డి డిమాండ్‌

రావులపాలెం: రెడ్‌బుక్‌ పాలనలో సామాన్యులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెం కొత్త కాలనీకి చెందిన మహిళ సత్యవతి ఇంటిని అధికార పార్టీకి చెందిన కొంత మంది వ్యక్తులు సోమవారం సాయంత్రం జేసీబీతో దౌర్జన్యంగా కూల్చివేశారు. బాధితురాలిని జగ్గిరెడ్డి మంగళవారం సాయంత్రం పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి రూ.20 వేల సాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గతంలో ఇచ్చిన ఇంటి పట్టా ఆధారంగా సత్యవతి కుటుంబం సుమారు నాలుగున్నర సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటూ ఇంటిని నిర్మించుకుందని చెప్పారు. పంచాయతీకి పన్నులు, విద్యుత్‌ కనెక్షన్‌కు బిల్లులు చెల్లిస్తోందన్నారు.

ఈ స్థలానికి సంబంధించి కోర్టులో సివిల్‌ వివాదం నడుస్తోందని, ఆ స్థలం ఎవరిదనే విషయాన్ని న్యాయస్థానం నిర్ణయిస్తుందని చెప్పారు. అయినప్పటికీ ఎటువంటి నోటీసులూ ఇవ్వకుండా అధికార పార్టీకి చెందిన కొంతమంది జేసీబీతో వచ్చి సత్యవతి ఇంటిని కూల్చివేయడం దౌర్జన్యానికి నిదర్శనమని మండిపడ్డారు. బాలింతతో పాటు కుటుంబ సభ్యులుండగా.. వారు కనీసం బయటకు వెళ్లేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా ఆ ఇంటిని నేలమట్టం చేయడం అమానుషమని మండపడ్డారు. ఎవరినైనా ఒక స్థలం నుంచి ఖాళీ చేయించాల్సి వస్తే ముందుగా నోటీసులు ఇవ్వడం, చట్టపరమైన ప్రక్రియను పాటించడం, అవసరమైతే ప్రత్యామ్నాయ వసతి కల్పించడం వంటి చర్యలు తీసుకోవాలని, ఇవేవీ పాటించకుండా ఇంటిని కూల్చివేయడం ఏవిధమైన పాలనని ప్రశ్నించారు.

రౌడీషీటర్‌ ఉన్నా అరెస్టు చేయలేదేం?

ఇల్లు కూల్చివేస్తూండగా బాధితులు 100కు ఫోన్‌ చేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి జేసీబీని అక్కడి నుంచి తీసుకెళ్లారని జగ్గిరెడ్డి తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు పోలీసులు చెబుతున్నారని, అందులో రౌడీషీటర్‌ కూడా ఉన్నట్లు పేర్కొన్నారని అన్నారు. అటుంటప్పుడు ఆ జేసీబీని సీజ్‌ చేసి, నిందితులను వెంటనే అరెస్టు చేయాల్సి ఉందని, కానీ, 24 గంటలు గడిచినా ఎలాంటి కఠిన చర్యలూ తీసుకోకపోవడమేమిటని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారు బయట స్వేచ్ఛగా తిరుగుతూంటే పోలీసు వ్యవస్థపై ప్రజలకు ఎలా నమ్మకం ఉంటుందని ప్రశ్నించారు. ఇంటి కూల్చివేత ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అక్కడి నుంచే కొత్తపేట డీఎస్పీతో ఫోనులో మాట్లాడారు. సత్యవతి కుటుంబానికి తక్షణ న్యాయం చేయడంతో పాటు, ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి, చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్‌ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే బాధిత కుటుంబంతో కలిసి పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళన చేస్తామని జగ్గిరెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ బొక్కా ప్రసాద్‌, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కర్రి అశోక్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు జవ్వాది రవిబాబు, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు షేక్‌ వల్లీబాబు, మాజీ వార్డు సభ్యులు కోనాల రాజ్‌కుమార్‌, సఖినేటి వాకులరాజు, నాయకులు ఆదిరెడ్డి, గోపి తదితరులు పాల్గొన్నారు

విచారణ చేస్తాం

నేతన్న సేవ పథకానికి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ప్రచారంపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తాం. నేత కార్మికులెవ్వరూ ఎవరికి ఎటువంటి లంచాలు ఇవ్వనవసరం లేదు. అర్హత ఉంటే కచ్చితంగా పథకం వర్తిస్తుంది.

– సూరిబాబు,

జిల్లా చేనేత జౌళి శాఖాధికారి, కాకినాడ

ఫ లబ్ధిదారుల ఎంపికలో

అక్రమార్కుల చేతివాటం

ఫ అర్హత ఉంటే రూ.3 వేలు,

లేకుంటే రూ. 5 వేల వసూలు?

ఫ జాబితా బయటకు రాకుండా జాగ్రత్తలు

సహకార

సంఘాలు

23,000

నేత కార్మికులు

కుటుంబాలు

5,000

నేతపై ఉఫాధి

పొందుతున్న

కార్మికులు

40,000

మగ్గాలు

2,400

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement