తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు ప్రారంభం

Aug 12 2026 12:16 AM | Updated on Aug 12 2026 12:16 AM

అమలాపురం రూరల్‌: తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ (102) వాహనాలను కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌, ఎస్పీ రాహుల్‌ మీనా, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మంగళవారం కలెక్టరేట్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జాతీయ ఆరోగ్య మిషన్‌ ఆధ్వర్యాన వేదవిద్య ఫౌండేషన్‌, శ్రీనివాస టూర్‌ ట్రావెల్స్‌ సహకారంతో జిల్లాకు 5 వాహనాలు మంజూరయ్యాయని తెలిపారు. వీటిలో అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి 2, రామచంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రికి 2, పి.గన్నవరం సీహెచ్‌సీకి ఒకటి చొప్పున కేటాయించామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్తీక్‌, డీపీఎంఓ టీకే శ్రీనివాసరావు, ముమ్మిడివరం సీహెచ్‌సీ గైనకాలజిస్ట్‌ జీవీవీ సత్యకుమార్‌ పాల్గొన్నారు.

నిషేధిత భూముల అర్జీలను వెంటనే పరిష్కరించాలి

అమలాపురం రూరల్‌: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో వచ్చిన నిషేధిత భూముల అర్జీలను త్వరితిగతిన పరిష్కరించాలని అధికారులను కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ ఆదేశించారు. అమరావతి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌, భూ పరిపాలన కమిషనర్‌ జయలక్ష్మి కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రీ సర్వే పనులను వేగవంతం చేసి, పెండింగ్‌ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. 22–ఎ జాబితాలోని కేసులను నిబంధనల మేరకు పరిశీలించి, అర్హత ఉన్న వాటిని సకాలంలో పరిష్కరించాలని సూచించారు. పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలని, రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్‌ పూర్తి చేసి భూ వివరాలను పారదర్శకంగా అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ వైఖోమ్‌ నైదియాదేవి, డీఆర్‌ఓ వి.సుబ్బారావు, డిప్యూటీ కలెక్టర్‌ విజయ కుమారి, సర్వే అండ్‌ ల్యాండ్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కె.ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించాలి

అమలాపురం రూరల్‌: ఈ నెల 15వ తేదీన దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ ఆదేశించారు. అమలాపురం బాలయోగి స్టేడియం వద్ద స్వాతంత్ర వేడుకల ఏర్పాట్లపై జాయింట్‌ కలెక్టర్‌ వైఖో మ్‌ నైదియాదేవి, ఎస్పీ రాహుల్‌ మీనాతో కలసి కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ వేడుకల నిర్వహణకు జేసీని ఇన్‌చార్జిగా నియమించామన్నారు. అన్ని శాఖలతో ఆర్‌డీఓ సమన్వయం చే సి, ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదే శించారు. జాతీయ పతాకావిష్కరణ, గౌరవ వందనం, ట్రాఫి క్‌ నియంత్రణ వంటి ఏర్పాట్లను ఎస్పీ నిర్వహించాలని సూచించారు. వివిధ బృందాల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణలుగా ఉండాలన్నా రు. డీఆర్‌ఓ వి.సుబ్బారావు, ఆర్‌డీఓ కె.సరళావతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

వీడియో అప్‌లోడ్‌ చేయాలి

అమలాపురం రూరల్‌: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం నిర్వహిస్తున్న పార్టనర్స్‌ ఇన్‌ నేషన్‌ బిల్డింగ్‌, దేశం కోసం... అనే నేను ప్రచార కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు వివిధ శాఖలతో కలెక్టరేట్‌ నుంచి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ నెల 13 నుంచి 15 వరకూ హర్‌ ఘర్‌ తిరంగా, ఆగస్టు 14న మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఆగస్టు 14, 15 తేదీల్లో ప్రభుత్వ భవనాలు, ముఖ్య ప్రదేశాలను త్రివర్ణ విద్యుద్దీపాలతో అలంకరించాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడాకారులు, కళాకారులు, యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు తమ పేరు చెప్పి, దేశ నిర్మాణానికి తాము చేయబోయే సేవను 30 సెకన్ల వీడియోగా సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని కోరారు. వీటిని జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి 912121 5342 లేదా శివసాయి(సోషల్‌ మీడియా)కి 94921 66856 నంబర్లకు వాట్సాప్‌ ద్వారా పంపించాలని కలెక్టర్‌ సూచించారు.

నూతన 102 వాహనాల ప్రారంభం

కాకినాడ క్రైం: జిల్లాకు కేటాయించిన నూతన 102 వాహనాలను కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌, కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ కోనాల అనిత కాకినాడ జీజీహెచ్‌లో ప్రారంభించారు. కార్యక్రమంలో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ లావణ్య, డిప్యూటీ సూపరింటెండెంట్‌ శ్రీనివాసన్‌, సీఎస్‌ఆర్‌ఎంవో మెహర్‌, జీజీహెచ్‌ చీఫ్‌ ఫార్మసీ ఆఫీసర్‌ పసుపులేటి శ్రీనివాస్‌, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement