శాకంబరిగా దర్శనమిస్తున్న వాగ్దేవి అమ్మవారు
ఆత్రేయపురం: మండలంలోని ర్యాలి గ్రామంలో కొలువైన వాగ్దేవి నగర మహాలక్ష్మి, ముత్యాలమ్మ వార్లకు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం గ్రామస్తులు చీర, సారె సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారిని శాకంబరిగా అలంకరించారు. అలాగే సమీప గ్రామాల ఆడపడుచులు అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం భారీ సంఖ్యలో భక్తులకు అమ్మవారి, తీర్థ ప్రసాదాలు, అఖండ అన్న ప్రసాదం అందజేశారు.


