రావులపాలెం: మండలంలోని కొమరాజులంక, ముమ్మిడివరప్పాడు గ్రామ దేవతలకు ఆదివారం గ్రామస్తులు సారే సమర్పించారు. కొమరాజులంక లో గ్రామ దేవత లంకాలమ్మ తల్లికి సారే మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గ్రామ మహిళలంతా భారీగా తరలివచ్చి 200 రకాల పండ్లు, స్వీట్లు, పానకాలు, పిండి వంటలను తయారుచేసి పసుపు, కుంకుమ, చీరలు, గాజులు పట్టుకుని స్థానిక వినాయక స్వామి, సీతారామచంద్రస్వామి, పేరంటాల అమ్మ, కనకదుర్గమ్మ ఆలయాలకు ఊరేగింపుగా వెళ్లి లంకలమ్మ తల్లికి సమర్పించారు. అమ్మవారిని కూరగాయలతో శాకంబరిగా అలంకరించారు.


