● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి
● రావులపాలెంలో
వైఎస్సార్ సీపీ నేతల సంతాపం
రావులపాలెం: కులమతాలకు అతీతంగా విలువలతో కూడిన రాజకీయం చేసిన నాయకుడు మాజీ మంత్రి, స్వర్గీయ ముద్రగడ పద్మనాభం అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి తదితర నేతలు గుర్తు చేసుకున్నారు. స్థానిక కాస్మోపాలిటిన్ రిక్రియేషన్ క్లబ్ (సీఆర్‌సీ)లో ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభను శనివారం జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ, పీఏసీ సభ్యుడు తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరై ముద్రగడ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన పోరాటాలు, అంకితభావం చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం ముద్రగడ మృతికి వారంతా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, రామచంద్రపురం నియోజకవర్గ పరిశీలకుడు కర్రి నాగిరెడ్డి, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకుడు పాటి శివకుమార్, రాష్ట్ర కార్యదర్శులు గొల్లపల్లి డేవిడ్ రాజు, గంధం రవికుమార్, జెడ్పీటీసీ సభ్యులు కుడుపూడి శ్రీనివాసరావు, గూడపాటి రమాదేవి, బోణం సాయిబాబా, ఎంపీపీలు మార్గన గంగాధరరావు, తోరాటి లక్ష్మణరావు, మండల కన్వీనర్లు తమ్మన, శ్రీను, బొక్కా కరుణాకరం, కనుమూరి శ్రీనివాసరాజు, ముత్యాల వీరభద్రరావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, మండల కాపు సంఘం అధ్యక్షుడు సాధనాల శ్రీనివాసరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సాకా ప్రసన్నకుమార్, బొక్కా వెంకటలక్ష్మి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ బండారు రాజా, సీనియర్ నాయకుడు కామిశెట్టి అమ్మన్న, చల్లా ప్రభాకరరావు, పార్టీ జిల్లా కార్యదర్శి బండారు దొరబాబు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుడు షేక్ వల్లీబాబా, గొలకోటి సూర్యప్రకాష్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రుద్రరాజు చినరాజు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి ఈద రవిరెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి ఇందుకూరి నరసింహరాజు పాల్గొన్నారు.


