ఆత్రేయపురం: తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం కోనసీమ తిరుపతి వాడపల్లి వేంకటేశ్వరుని దర్శనానికి లక్షకు పైగా భక్తులు తరలివచ్చారు. భక్తుల ప్రదక్షిణలతో మాడవీధులు కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా ఆదాయం భారీగా సమకూరినట్టు ఈఓ, దేవదాయశాఖ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. కాలి నడకన సైతం భక్తులు భారీగా వచ్చారు. అధిక సంఖ్యలో వాహనాల రాతో ఆలయ కారు పార్కింగ్ వద్ద, కొత్త వంతెన, లొల్ల లాకులు వద్ద ట్రాఫిక్‌కు పలుమార్లు అంతరాయాలు ఏర్పడ్డాయి. ఏడు శనివారాల వ్రతానికి, ఏకాదశి సందర్భంగా, సాధారణ దర్శనాలకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు నిండిపోయాయి. ఆలయం ఆవరణలో వెంకట్ అనే భక్తుడు మైక్‌లో చేసిన ప్రచారం ఆకట్టుకుంది. సుప్రభాత సేవ, తొలి హారతి, నిరాజనం, ఐశ్వర్య లక్ష్మీ హోమం, బాల భోగం తదితర కార్యక్రమాలను దర్శించిన భక్తులు అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ఉచిత అన్న ప్రసాదం, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆర్యవైశ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ చైర్మన్ ముదు నూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు.
విశేష సంఖ్యలో
స్వామివారిని దర్శించిన భక్తులు
తొలి ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు
ఏడు శనివారాల
వ్రత ప్రదక్షిణలు చేసిన భక్తులు


