● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి
● ముంపు బారిన పడిన పొలాల పరిశీలన
ఆత్రేయపురం: కూటమి ప్రభుత్వ వైఫల్యంతోనే రైతు లు అవస్థలు పడుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆత్రేయపురం, లొల్ల, వాడపల్లి గ్రామాల్లో ముంపు బా రిన పడిన పంట పొలాలను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జి ల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావుతో కలసి ఆత్రేయపురంలో పొలాల వద్ద విలేకరులతో మాట్లాడారు. గత వేసవిలో కాలువల్లో పూడికతీత వంటి అత్యవసర పనులు చేయకపోవడంతో ప్రస్తుతం సాగునీటి సరఫరా సంక్షోభం నెలకొందన్నారు. ఆత్రేయపురంలో ఇరిగేషన్ గట్టును ఆక్రమించి బ్రాందీ షాపు ఏ ర్పాటు చేశారని, జిల్లా ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ప్ర భుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు.
మరమ్మతుల్లో అవినీతి
జగ్గిరెడ్డి మాట్లాడుతూ వేసవిలో చేపట్టిన పనుల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందన్నారు. ఆత్రేయపురం, లొల్ల, వాడపల్లి గ్రామాల్లో పల్లపు భూములకు శాశ్వత పరిష్కారంగా ఇటీవల ప్రభుత్వం 2.90 కోట్లతో రెండు సైఫన్లు నిర్మించిందని, అయినా ముంపు సమస్య పరిష్కారం కాకపోవడానికి పనుల్లో జరిగిన అవినీతే ప్రధాన కారణమన్నారు. ఇక్కడ సుమారు 500 ఎకరాలకు పైగా వరి పొలాలు నీట మునిగి రైతులు నష్టపోయారని, వారికి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇరిగేషన్ ఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించి, రైతులతో ధర్నా చేస్తామన్నారు. గత సీజన్‌లో రూ.9 కోట్లను పనుల నిమిత్తం విడుదల చేసినట్లు ఇరిగేషన్ మంత్రి తెలియజేశారని, ఆ నిధులు ఏమయ్యాయో సమగ్ర విచారణ చేసి నిందితులపై కేసులు నమోదు చేయాలన్నారు. వేణుగోపాలరావు మాట్లాడుతూ 2019లో ధవళేశ్వరం బ్యారేజీకి 50 కొత్త గేట్లు అమర్చినట్లు సీఎం చంద్రబాబు తెలియజేశారని, అది నిజం కాదని తెలిపారు. కేవలం గేట్లకు తారు పూసి పనులు చేసినట్లుగా దేశం నాయకులు బిల్లులు కాజేశారని, దీనిపై అప్పట్లో కొందరు అధికారులను సస్పెండ్ చేయడం కూడా జరిగిందన్నారు. సమావేశంలో ఆత్రేయపురం మండల పరిషత్ అధ్యక్షురాలు కుండ అన్నపూర్ణ, జెడ్పీటీసీ సభ్యులు బోనం సాయిబాబు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు చిలువూరి రామకృష్ణంరాజు, మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు ఎం.కృష్ణంరాజు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ కనుమూరి శ్రీనురాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు గొట్టుముక్కల గోపిరాజు, ఎంపీటీసీ సభ్యులు రాంబాబు, కేత ఏడుకొండలు, దాట్ల సూర్యనారాయణరాజు, నాయకులు వేగేశ్న గోపి, సరెళ్ల పండు, మాధవరావు పాల్గొన్నారు.


