దివ్యాంగులను అన్నింటా ప్రోత్సహించాలి
అమలాపురం టౌన్: పాఠశాలల్లో దివ్యాంగ విద్యార్థులను అన్నింటా ప్రోత్సహించాలని సమగ్ర శిక్షా రాష్ట్ర అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఎస్‌ఏపీడీ) కె.రవీంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. అమలాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ (సీడబ్ల్యూఎస్‌ఎన్) కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు శుక్రవారం జరిగిన జోనల్ స్థాయి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ క్రీడా పోటీలు, ఎంపికల కార్యక్రమాన్ని రవీంద్రనాథ్‌రెడ్డి ప్రారంభించి ప్రసంగించారు. సహిత విద్య ద్వారా దివ్యాంగులను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన చెప్పారు. సహిత విద్య స్టేట్ కన్సల్టెంట్ వై.నరసింహ మాట్లాడుతూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు విభిన్న ప్రతిభావంతులను బేస్ క్యాంప్ ద్వారా ప్రోత్సహిస్తున్నామని వివరించారు. డీఈఓ పి.నాగేశ్వరరావు, సమగ్ర శిక్షా జిల్లా ఏపీసీ జి.మమ్మీ మాట్లాడుతూ జిల్లాలో 22 భవిత కేంద్రాల ద్వారా 486 మంది దివ్యాంగులకు విద్యనందిస్తున్నామని తెలిపారు. ఆరు నుంచి 18 ఏళ్ల వయసున్న 3,108 మంది సీడబ్ల్యూఎస్‌ఎన్ విద్యార్థులు ఉన్నారన్నారు. సహిత విద్య జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ జోనల్ పరిధిలో విద్యార్థులకు 100, 200, 400, 800 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, షార్ట్‌ఫుట్ తదితర క్రీడా పోటీలను నిర్వహించారు. సహిత విద్య జిల్లా ఓ ఆర్డినేటర్ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ పోటీల్లో జోనల్ పరిధిలోని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి 150 మంది దివ్యాంగులు పాల్గొన్నారన్నారు. స్టేట్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ శంకర్, వ్యాయామ ఉపాధ్యాయులు హాజరయ్యారు.


