జాతీయ స్థాయి సైన్స్‌ఫేర్‌కు వన్నెచింతలపూడి ప్రాజెక్ట్
అమలాపురం రూరల్: రాష్ట్రస్థాయి 53వ విద్యా, వైజ్ఞానిక ప్రదర్శల్లో వన్నెచింతలపూడి పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటారు. ఈనెల 23, 24 తేదీల్లో విజయవాడలో జరిగిన వన్నెచింతలపూడి హైస్కూల్ విద్యార్థులు రూపొందించిన ఈజీ మిషన్ ఫర్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపిపై జాతీయ స్థాయి ప్రదర్శనలో చోటు సంపాదించింది. ఈ ప్రాజెక్టు తయారు చేసిన విద్యార్థి రోహిత్ విజయభాస్కర్‌కు గైడ్ టీచర్‌గా ప్రధానోపాధ్యాయుడు గుబ్బల నాగ సత్యనారాయణ వ్యవహరించారు. ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డి వారికి ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందజేశారు. మూడేళ్లుగా కోనసీమకు జాతీయస్థాయిలో స్థానం సాధిస్తున్న హెచ్‌ఎం సత్యనారాయణను అధికారులు గురువారం అభినందించారు.


