భీష్మ సమానుడు వాజ్‌పేయ్
అమలాపురం రూరల్: జిల్లా బీజేపీ కార్యాలయంలో దివంగత ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయ్ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిలుగా జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, జాతీయ కౌన్సిల్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ పాల్గొని వాజ్ పేయి చిత్రపటానికి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ భారత రాజకీయాలలో వాజ్‌పేయి భీష్ముడిలాంటి వారన్నారు. రాజనీతజ్ఞడిగా, అజాతశత్రువు అనే గుర్తింపు ఆయనకు ఉంది. ఆయన హయాంలో జరిగిన పోక్రాన్ అణు పరీక్షలు, స్వర్ణ చతుర్భుజి రహదారుల నిర్మాణం, గ్రామీణ రహదారుల అభివృద్ధి లాంటి కార్యక్రమాలు భారతదేశ గమనాన్ని మార్చేశాయన్నారు. పట్టణ అధ్యక్షుడు అయ్యల బాషా, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకురిమెల్లి శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షుడు చిలకమర్తి కస్తూరి తదితరులు ఆయనకు నివాళులర్పించారు.


