సగరుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వావి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న సగర కులస్తులకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించడంతో పాటు, ఒక ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సగర సంఘం అధ్యక్షుడు గుర్రం మహాలక్ష్మి డిమాండ్ చేశారు. స్థానిక సూర్యకళా మందిరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సగర సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గురువారం ఘనంగా జరిగింది. సంఘం గౌరవ అధ్యక్షుడిగా ములికి సత్యనారాయణ, అధ్యక్షుడిగా కుర్ర మహాలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నక్క కిశోర్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా తన్నాటి అప్పలస్వామి డిప్యూటీ ప్రధాన కార్యదర్శులుగా నక్క వీర వెంకట్రావు, శ్రీను, కోశాధికారి తంగెళ్ల అప్పారావుతో పాటు 151 మంది ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గాన్ని సభ్యులు సత్కరించారు.


