శివరాత్రికి జాతీయ వాలీబాల్ పోటీలు
ఉప్పలగుప్తం: మహాశివరాత్రి సందర్భంగా గొల్లవిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఐదు రోజుల పాటు అరిగెల శ్రీరంగయ్య (ఏఎస్‌ఆర్) జాతీయ స్థాయి డే అండ్ నైట్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తామని నిర్వాహక కమిటీ అధ్యక్షుడు దేశంశెట్టి వెంకట లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం గొల్లవిల్లి చినరాజప్ప కల్యాణ మండపంలో ఆయన అధ్యక్షతన నిర్వాహక కమిటీ సభ్యులతో ఏఎస్సార్ టోర్నమెంట్ కార్యాచరణ సమావేశం నిర్వహించారు. ముఖ్య సలహాదారుడు అరిగెల వెంకట ముసలయ్య మాట్లాడుతూ ఫిబ్రవరి 15, 16, 17, 18, 19 తేదీల్లో జరిగే ఈ పోటీలకు దేశ వ్యాప్తంగా పలువురు క్రీడాకారులు వస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, సొసైటీ అధ్యక్షులు మంచెం బాలకృష్ణ, చిక్కం ఉమేష్, టోర్నమెంటు నిర్వాహక సభ్యులు పాల్గొన్నారు.


