మా పల్లె మారింది
ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఉప్పలగుప్తం మండలం నంగవరం గ్రామంలో నిర్మించిన వెల్‌నెస్ సెంటరు
నిరంతరం ఏదో
ఒక సంక్షేమం అందేది
గత ప్రభుత్వం హయాంలో నిరంతరం ఏదో ఒక సంక్షేమం అందిస్తుండేవారు. మా కుటుంబంలో నా భార్యకు డ్వాక్రా రుణమాఫీ జరిగి అప్పు భారం తగ్గింది. మా అమ్మకు నెలనెలా పెన్షన్ అందేది. ఫీజు రీయింబర్స్‌మెంటుతో నా కుమారుడు డిగ్రీ పూర్తి చేశాడు. నాకు రైతు భరోసా పడేది. ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చేది. ప్రభుత్వమే ఉచిత బీమా ప్రీమియం చెల్లించడం వల్ల పంట నష్టపోతే పరిహారం అందేది. అటుంవంటి ఆపద్బాంధవుడు ఎన్నో పుట్టిన రోజులు జరుపుకొని మళ్లీ అధికారం చేపట్టి ప్రజలకు సుపరిపాలన అందించాలని కోరుకుంటున్నాను.
– రెడ్డి పుల్లయ్య,
నంగవరం, ఉప్పలగుప్తం మండలం
అడపాదడపా రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, లైటింగ్ ఇంతకు మించి పెద్దగా అభివృద్ధి ఎరగని పల్లెలు ఎన్నో. ఉప్పలగుప్తం మండలం నంగవరం గ్రామం కూడా ఇంచుమించు అటువంటిదే. కాని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఈ గ్రామం రూపురేఖలు దాదాపుగా మారిపోయాయి. రోడ్లతో పాటు సచివాలయం, ఆర్బీకే, హెల్త్ సెంటర్ వచ్చాయి. రూ.76 లక్షలతో అవన్నీ ఒకేచోట నిర్మించారు. ఇప్పుడు సచివాలయంలో గడపగడపకూ నిధుల్లో భాగంగా రెండు విడతలుగా రూ.40 లక్షల విడుదల చేశారు. గ్రామంలో ఎకరం భూమిని కొనుగోలు చేసి దాదాపుగా 48 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. నవ రత్నాలతో పాటు వివిధ పథకాల ద్వారా గ్రామంలో సుమారు రూ.16.63 కోట్లను సంక్షేమ పథకాల ద్వారా అందజేశారు. ఇది కాకుండా 48 మందికి ఇళ్ల స్థలాలు, 235 మందికి జగన్న విద్యా కానుక వంటివి అందించారు.
మా పల్లె మారింది


