నాడు ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం
గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అందించిన ప్రోత్సాహం వల్ల సఖినేటిపల్లి మండల పరిధిలోని ఉయ్యూరువారి మెరకలో ఉన్న మా ఆంధ్రా ప్రియ పికిల్స్‌కు స్వర్ణయుగమనే చెప్పాలి. మేము 1995లో వినాయక డ్వాక్రా గ్రూపును ఏర్పాటు చేసుకున్నాం. మా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తోలేటి శ్రీదేవి, మందపాక సీతా మహలక్ష్మి ఆధ్వర్యంలో 30 మంది సభ్యులతో ఆంధ్ర ప్రియ పికిల్స్ సెంటర్ నెలకొల్పాము. అప్పట్లో బ్యాంకు రుణాలు ఒక్కొక్కరికీ రూ.20 వేలు చొప్పున మంజూరయ్యాయి. . బయట నుంచి కొంత పెట్టుబడులు తెచ్చి వ్యాపారం చేశాము. 2005లో శ్రీతులసి డ్వాక్రా గ్రూపు అధ్యక్ష, కార్యదర్శులు చింతపట్ల నాగచిట్టి సింహాద్రమ్మ, ఎర్రా మాధవి ఆధ్వర్యంలో మరో 30 మంది సభ్యులు కలిశారు. మొత్తం 60 మంది సభ్యులు చేసే ఉత్పత్తులు సాలీనా 20 టన్నులకు చేరింది. రూ.12 లక్షల పెట్టుబడితో చేసిన వ్యాపారంలో ఏడాదికి రూ.15 లక్షల వరకు టర్నోవర్ ఉండేది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలు, పట్టణాలకు కూడా పచ్చళ్లు పంపేవాళ్లం. గత ప్రభుత్వ హయాంలో 2022లో మా గ్రూపునకు రూ.3 లక్షలు రుణం మంజూరు చేశారు. దీని వల్ల వ్యాపారాన్ని విస్తరించాం. డీఆర్‌డీఏ అధికారులు మమ్మల్ని, మా వ్యాపారాన్ని ఎంతగానో ఆదరించి, మా పచ్చళ్లకు మార్కెటింగ్ కల్పించారు. అప్పటితో పోల్చుకుంటే వివిధ కారణాలతో మా వ్యాపారం మందగించింది. గత ప్రభుత్వంలో జగన్ చేసిన మేలును ఎన్నటికీ మరువలేం.
– ఆంధ్రా ప్రియ పికిల్స్ తయారీదారులు


