గూడు కల్పించిన మహానుభావుడు
ఏళ్ల తరబడి అద్దె ఇంట్లో జీవించిన తమ కుటుంబానికి గూడు కల్పించిన మహానుభావుడు జగనన్న. ఇంటి స్థలం మంజూరు చేయడంతో పాటు ఇంటి నిర్మాణానికి రుణ సాయం చేయడం వల్ల ఇల్లు కట్టుకోగలిగాం. నా కుమార్తె కనక దుర్గా మహాలక్ష్మి, కుమారుడు గణేష్‌కు వివాహాలు చేశాం. కూలి పని చేసుకుంటూ అక్కడక్కడ అద్దె ఇంట్లో గడిపిన మేము సొంతంగా ఇల్లు కట్టుకుంటామని కలలో కూడా అనుకోలేదు. ఆ కల నెరవేర్చిన జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. ఇప్పుడు మేము సొంత ఇంటిలో ఏ బాదరబందీ లేకుండా ఉంటున్నాం. ఆయన నిండు నూరేళ్లు జీవించాలి. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలి.
– యనమదల భవానీ, రాంబాబు,
జగనన్న కాలనీ, ఆలమూరు మండలం.


