ఉచిత ‘బీమా’కు దూరమయ్యాం
మాది కొత్తపేట మండలం వాడపాలెం. కొత్తపేటతో పాటు కపిలేశ్వరపురం మండలం కేదార్లంకలో నేను, నాకు కుటుంబ సభ్యులు పది ఎకరాల్లో అరటి రకాలు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా వల్ల రూపాయి ఖర్చు లేకుండా సాగుకు బీమా భరోసా ఉండేది. ఇప్పుడు ఎకరాకు రూ.మూడు వేల ప్రీమియం కట్టమనడం వల్ల మాకు రూ.30 వేలు అవుతోందని కట్టలేదు. 2022–23 వరదలకు రూపాయి ప్రీమియం కట్టకపోయినా ఆరు ఎకరాల్లో పంట దెబ్బతింటే బీమా పరిహారం రూ.60 వేలు వచ్చింది. ఈ ఏడాది మోంథా తుపాను వల్ల పెద్దగా నష్టం లేకున్నా కొన్ని చెట్లు నేల కూలాయి. అసలు నష్టం ఇప్పుడు బయటపడుతోంది. గాలుల వల్ల గెలల నాణ్యత దెబ్బతింటోంది. జిల్లా యూనిట్ అనడం వల్ల బీమా ఉన్నా పెద్దగా పరిహారం వచ్చే అవకాశం లేదు.
– పెదపూడి శ్రీనివాస్, వాడపాలెం, కొత్తపేట మండలం


