22న జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన
డీఈవో నాగేశ్వరరావు
అమలాపురం టౌన్: స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 22వ తేదీన నిర్వహించే జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు బాధ్యత తీసుకుని విజయవంతం చేయాల డీఈవో పి.నాగేశ్వరరావు సూచించారు. స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం సైన్స్ ఎగ్జిబిషన్ సన్నాహక సమావేశంలో సమగ్ర శిక్ష జిల్లా ఏసీసీ జి.మమ్మీతో పాటు డీఈఓ పాల్గొని పలు సూచనలు సలహాలు ఇచ్చారు. జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన సమావేశంలో ప్రదర్శనలో ఏర్పాటు చేసే 176 ప్రయోగాలపై చర్చించింది. సైన్స్ ఉపాధ్యాయుల నుంచి ఒకటి, విద్యార్థుల వ్యక్తిగత కేటగిరీ నుంచి రెండు, సామూహిక కేటగిరీ నుంచి రెండు వంతున ప్రాజెక్టులను ప్రదర్శిస్తారని డీఈవో వివరించారు. రామచంద్రపురం డీవైఈవో పి.రామలక్ష్మణమూర్తి, సమగ్ర శిక్షా సీఎంవో బీవీవీ సుబ్రహ్మణ్యం, ఏపీవో డాక్టర్ ఎంఏకే భీమారావు తదితరులు పలు అంశాలపై ప్రసంగించారు. అనంతరం సైన్స్ ఫెయిర్ లోగోను విద్యా శాఖాధికారులు ప్రదర్శించారు.


