
లంకల్లో భయం.. భయం
పి.గన్నవరం: గోదావరి వరద పెరుగుతున్న నేపథ్యంలో పి.గన్నవరం మండలంలోని లంక గ్రా మాల ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. వశిష్ట, వైనతేయ నదీపాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అ రిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పడవలపై వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మన జిల్లా సరిహద్దులోని ఆనగర్లంక, సిర్రావారిలంక, పెదమల్లంక, అయోధ్యలంక గ్రా మాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.