
ఉద్యోగులకు అండగా ఏపీజీఈఏ
అమలాపురం టౌన్: ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) ఎప్పుడూ అండగా ఉంటుందని జిల్లా శాఖ అధ్యక్షుడు మద్దాల బాపూజీ అన్నారు. అమలాపురంలోని ముక్తేశ్వరం రోడ్డులో తాలూకా శాఖ అధ్యక్షుడు కె.కామేశ్వరరావు అధ్యక్షతన ఏపీజీఈఏ వ్యవస్థాపక దినోత్సవాన్ని శనివారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా బాపూజీ మాట్లాడుతూ జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపీజీఈఏ చేస్తున్న కృషిని వివరించారు. ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సంఘంగా ఏర్పడిన అనతి కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగుల సభ్యత్వం కలిగిన ఏకై క సంఘంగా సేవలు అందిస్తోందన్నారు. అనంతరం నాయకులు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకొన్నారు. పీఆర్‌సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏ బిల్లులు ఇవ్వాలని, ఉద్యోగులకు రూ.25 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని సమావేశం డిమాండ్ చేసింది. సంఘ జిల్లా కోశాధికారి జేఏ రాజ్‌కుమార్, నాయకులు లక్ష్మణ్‌కుమార్, సూర్యనారాయణ, రాజు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
బడుగు వర్గాల ఆశాజ్యోతి
గౌతు లచ్చన్న
అమలాపురం రూరల్: ఉత్తర కోస్తాలో ఉదయించిన ప్రజా సూర్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న అని కలెక్టరేట్ పరిపాలన అధికారి కడలి కాశీ విశ్వేశ్వరరావు అన్నారు. శనివారం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద గౌతు లచ్చన్న జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏఓ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి లచ్చన్న జయంతి వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, పోరాటాలకు మారుపేరుగా గౌతు లచ్చన్న నిలిచారన్నారు. బీసీ వెల్ఫేర్ అధికారి పి.రమేష్, బీసీ వెల్ఫేర్ వసతి గృహ సంక్షేమ అధికారులు కల్పవల్లి అనురాధ, గౌరీ కాత్యాయిని, సీహెచ్ సాయిరామ్, సీహెచ్ రాధాకృష్ణ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన
విభాగం ప్రధాన కార్యదర్శిగా దేవీప్రకాష్
మామిడికుదురు: వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా పి.గన్నవరం నియోజకవర్గానికి చెందిన పాముల దేవీప్రకాష్‌ను నియమించారు. ఈ మేరకు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శనివారం ఉత్తర్వులు వచ్చాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిమామకం జరిగింది. తనపై ఉంచిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని దేవీప్రకాష్ అన్నారు. ఆయన నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
తొలి తిరుపతికి
తండోపతండాలుగా..
శృంగార వల్లభుని ఆదాయం రూ.2.38 లక్షలు
పెద్దాపురం: తొలి తిరుపతి స్వయంభూ శృంగార వల్ల భుని ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఆల య ఈఓ వడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందుల తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అర్బకులు పెద్దింటి నారాయణాచార్యు లు, పురుషోత్తమాచార్యులు స్వామి వారిని పూలమాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల టిక్కెట్లు, అన్నదానం, కేశ ఖండన ద్వారా స్వామి వారికి రూ.2,38,048 ఆదాయం సమకూరినట్లు ఈఓ తెలిపారు. సుమా రు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా 3,500 మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఈఓ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు, గ్రామ సర్పంచ్ మొయిళ్ల కృష్ణమూర్తి, ఆలయ సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఉద్యోగులకు అండగా ఏపీజీఈఏ

ఉద్యోగులకు అండగా ఏపీజీఈఏ

ఉద్యోగులకు అండగా ఏపీజీఈఏ