
హరే రామ.. హరే కృష్ణ
జిల్లాలో
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
అమలాపురం రూరల్: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. రాధా కృష్ణుల వేషధారణలో చిన్నారులు అలరించారు.. ఉట్టికొట్టే కార్యక్రమాలను ఉత్సాహంగా జరిపారు. ఇస్కాన్ రాజమహేంద్రవరం అవుట్ పోస్ట్ ఆధ్వర్యంలో అమలాపురం మండలం జనుపల్లిలోని మదన్‌గోపాల్ భజన్ కుటీర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. శ్రీకృష్ణ లీలలపై ఇస్కాన్ మేనేజర్ శివానంద నిమయిదాస్ ప్రవచనం చేశారు. అనంతరం ఉట్టికొట్టే ఉత్సవం నిర్వహించారు. ఇస్కాన్ ప్రతినిధులు సద్భుజదాస్, యశోమతి నందనదాస్ పాల్గొన్నారు. అమలాపురం దక్షిణమూర్తి వీధిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. రాధాకృష్ణుల వేషధారణలో చిన్నారులు అలరించారు.